ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: పాపాల పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి దమ్ముంటే చర్చకు రావాలి

ABN, First Publish Date - 2023-03-10T19:06:45+05:30

ఏపీలో జాబు నిల్ గంజాయి ఫుల్లు అని, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌ జగన్‌రెడ్డి అని నారా లోకేష్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుపతి: వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (YCP Minister Peddireddy Ramachandra Reddy), ఎంపీ మిథున్‌రెడ్డిపై (MP Mithun Reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (TDP National General Secretary), ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (former AP Minister Nara Lokesh) విమర్శలు గుప్పించారు. పాపాల పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తానని లోకేష్ స్పష్టం చేశారు. రేపు తంబళ్లపల్లిలోనే తాను ఉంటానని.. దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్‌ డిమాండ్ చేశారు. మదనపల్లికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నా చేసిందేమీ లేదని, ప్రజలు ఒక్క ఛాన్స్ విధ్వంసానికి ఇచ్చినట్టు ఉందని లోకేష్‌ ఆరోపించారు. ఏపీలో జాబు నిల్ గంజాయి ఫుల్లు అని, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌ జగన్‌రెడ్డి అని నారా లోకేష్‌ విమర్శించారు. పాపాల పెద్దిరెడ్డి కుటుంబం వల్లే మదనపల్లికి పరిశ్రమలు రాలేదని, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరును కలిపి జిల్లా చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara lokeshYuvaGalam Padayatra) చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 39వ రోజు పాదయాత్రలో లోకేష్‌ను మదనపల్లి ప్రముఖులు, విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan Reddy) కి రాష్ట్రాభివృద్ధిపై ఎటువంటి ఆలోచనా లేదన్నారు. అధికారంలోకి వచ్చాక కూల్చివేతలు, ఉన్నకంపెనీలను బెదిరించి పంపడం తప్ప ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. మున్సిపాలిటీలు, స్థానికసంస్థలను పూర్తిగా దివాలా తీయించి కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితికి తెచ్చారన్నారు. మదనపల్లి టమోటా రైతుల కష్టాలు తీర్చే విషయంలో టీడీపీకి స్పష్టమైన విజన్ ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు ద్వారా టమోటా రైతుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తామన్నారు.

రాష్ట్రంలోని వేల కోట్ల రూపాయల ప్రముఖ ట్రస్టులు, ఎయిడెడ్ భూముల ఆస్తులను కొట్టేయాలన్న దుర్భుద్ధితోనే జగన్ ప్రభుత్వం విలీనం నాటకానికి తెరలేపిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో నాణ్యమైన విద్యనందించిన క్రిస్టియన్, మైనారిటీ ఎయిడెడ్ విద్యాసంస్థలను బలవంతంగా స్వాధీనం చేసుకొని పేదలకు విద్యను దూరం చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలకు విద్యాసంస్థలు కూడా బలిపశువులుగా మారాయన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాది విద్యార్థులకు ఉత్తమ విద్యను దూరం చేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారిస్తామన్నారు. ఆయా కళాశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చి నాణ్యమైన విద్యను అందిస్తాంమని తెలిపారు. రాయలసీమలోనే పేరెన్నికగన్న మదనపల్లి బీటీ కళాశాలకు గత వైభవాన్ని తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-03-10T19:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising