YSRCP : వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం.. ప్లీజ్.. ప్లీజ్ వెళ్లకండని బతిమలాడిన పరిస్థితి..!
ABN, First Publish Date - 2023-03-02T22:52:51+05:30
ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే అధికార పార్టీపై సిట్టింగ్ ఎమ్మెల్యేలే అసంతృప్తి గళం విప్పుతున్నారు...
ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే అధికార పార్టీపై సిట్టింగ్ ఎమ్మెల్యేలే అసంతృప్తి గళం విప్పుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు (YSRCP MLAs) ఆనం రామ నారాయణరెడ్డి (Anam Ram Narayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) అసంతృప్తి వ్యక్తం చేయగా.. వీరిలో కోటంరెడ్డి రెబల్‌గా మారి వైసీపీ నుంచి బయటికొచ్చేశారు. అయితే.. ఆనం మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు కానీ.. అధిష్టానం మాత్రం నెల్లూరు జిల్లా వెంకటగిరి (Venkatagiri) నియోజకవర్గానికి ఇంఛార్జ్ బాధ్యతలను నేదురమల్లి రాంకుమార్‌రెడ్డికి (Neduramalli Ram Kumar Reddy) కట్టబెట్టింది. అయితే నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన రాంకుమార్‌రెడ్డికి అడగడుగునా ఊహించని రీతిలో షాక్‌లే తగులుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోవట్లేదనే వార్తలు రాగా.. తాజాగా ఆయనకు ఘోర అవమానమే జరిగింది.
అసలేం జరిగింది..?
వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని బాలాయపల్లి మండలం జయంపులో వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే సమావేశానికి రాకుంటే, పథకాలు రావంటూ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తునే ప్రజలను తరలించారు. వారినే వైసీపీ కార్యకర్తలుగా చూపే ప్రయత్నం చేశారు. సభకు తరలించారు.. కూర్చోబెట్టారు ఇంతవరకూ అంతా ఓకే కానీ.. నిమిషాల వ్యవధిలోనే మొత్తం సీన్ మారిపోయింది. సమావేశం ప్రారంభమైన కాసేపటికే సభకు ఒక్కొక్కరుగా ఇంటిబాట పట్టారు. తీరా చూస్తే సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. గుంపులు, గుంపులుగా జనాలు వెళ్తుండగా రాంకుమార్ రెడ్డితో పాటు.. వైసీపీ నేతలు ‘ అయ్యో.. వెళ్ళకండి.. కూర్చోండి... ప్లీజ్.. ప్లీజ్’ అని బతిమలాడినా ఒక్కరు కూడా లెక్కచేయకుండా సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో నేదురుమల్లికి పరువు పోయినట్లు అయ్యిందని అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. ఇంకొందరైతే నిజంగా ఇది ఘోర అవమానం అని ఫీలవుతున్నారట. అటు ఈ వ్యవహారంపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోందట. దీనిపై చిత్రవిచిత్రాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారట.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నిర్వహించే భారీ బహిరంగ సభల్లోనే జనాలు, కార్యకర్తలు తుర్రుమంటున్నారని ఈ మధ్య విజువల్స్‌తో సహా చాలానే చూశాం. అయితే సీఎం సభల నుంచే వెళ్తున్నారుగా.. ఇక ఎమ్మెల్యేలు, నేతలు సమావేశాల్లో వెళ్లడం పెద్ద విషయమేమీ కాదని కొందరు పార్టీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారట. వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించిన తర్వాత నేదురమల్లికి ఎవరూ సహకరించట్లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ముఖ్య అనుచరులు చాలా హర్ట్ అయ్యారట. ఎన్నికలకు ఇంకా చాలా రోజులు ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే.. ఎలక్షన్ దగ్గరపడితే ఎలా ఉంటుందో ఏంటో మరి..!
******************************
ఇవి కూడా చదవండి..
******************************
YSR Congress : అన్నొస్తున్నాడంటే ఆనందం కాదండోయ్.. అన్నీ తొలగించాల్సిందే.. ప్రకృతితో పరాచకాలు ఏంటయ్యా జగన్.. ఆ రోజులు మరిచారా..!?
******************************
పెను విషాదం.. గుండెపోటుతో టీడీపీ ఎమ్మెల్సీ కన్నుమూత..
******************************
Naveen Murder Case : నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. ఇంత జరిగినా...
******************************
TS Congress : కొడంగల్ నుంచే పోటీచేస్తానంటున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి పరిస్థితేంటి.. పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా..!?
******************************
Lokesh Yuva Galam : మునిరాజమ్మా.. మీ తెగువకు వందనం.. ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారన్న చంద్రబాబు.. అసలేం జరిగిందంటే..!
*****************************
Naveen Murder Case : నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. ఇంత జరిగినా...
******************************
YuvaGalam Padayatra : నారా లోకేష్ పాదయాత్రలో ఊహించని సీన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో.. అసలేం జరిగిందంటే..!
******************************
YSR Congress : చేతులెత్తేసిన వైఎస్ జగన్... ఓటమి భయం పట్టుకుందా.. ఆ ఒక్క మాటతో..!?
******************************
Vangaveeti Radha: వంగవీటి రాధా పార్టీ మారుతున్నారా.. ముహూర్తం కూడా ఫిక్సయ్యిందా.. ఓహో మాస్టర్ ప్లాన్ ఇదా..!?
******************************
Telugudesam : టీడీపీ వైపు మాజీ మంత్రి చూపు.. ఎమ్మెల్యేగా పోటీచేయాలని ప్లాన్.. ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!
******************************
Doctor Preethi died: మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్
******************************
Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!
******************************
Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో
******************************
TS Congress : ‘కోమటిరెడ్డి ఎవడు.. నాకు తెలియదు..’ ఎంపీని షబ్బీర్ అలీ ఇంత మాట అనేశారేంటి.. ఎందుకింత రచ్చ..!?
******************************
Viveka Murder Case : పీకలదాకా వచ్చేసరికి సిల్లీ లాజిక్స్ ఏంటి సజ్జలా.. అసలేంటీ మాటలు.. నవ్వుకుంటున్నారు బాబోయ్..!
******************************
Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!
******************************
Updated Date - 2023-03-02T23:44:42+05:30 IST