ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Survey Viral: ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వైసీపీకి, బీఆర్‌ఎస్‌కు ఎన్నొస్తాయని తేలిందంటే..

ABN, First Publish Date - 2023-08-25T17:35:23+05:30

సోషల్ మీడియాలో ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే వైరల్‌ మారింది. జాతీయ ఛానల్ సర్వేతో ఏపీలో అధికార వైసీపీ పార్టీలో కలవరం మొదలైంది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే NDAలో లేని టీడీపీకి 15 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. NDAలో ఉన్న ఏ పార్టీకీ ఇన్ని సీట్లు రావని జాతీయ సర్వే అంచనా వేసింది.

సోషల్ మీడియాలో ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే వైరల్‌గా మారింది. జాతీయ ఛానల్ సర్వేతో ఏపీలో అధికార వైసీపీ పార్టీలో కలవరం మొదలైంది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే NDAలో లేని టీడీపీకి 15 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. NDAలో ఉన్న ఏ పార్టీకీ ఇన్ని సీట్లు రావని జాతీయ సర్వే అంచనా వేసింది. సర్వే ఫలితాలను గురువారం రాత్రి సదరు జాతీయ ఆంగ్ల ఛానల్ విడుదల చేసింది. సర్వే వైరల్‌గా మారడంతో వైసీపీ శ్రేణుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇదిలా ఉండగా.. సదరు జాతీయ ఛానల్ ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిస్థితులపై చేసిన సర్వే రిపోర్ట్స్‌ను తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఉంచారు. ఆగస్ట్ 2022లో ఇదే ఛానల్ టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో 7 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయని, జనవరి 2023లో టీడీపీ 10 ఎంపీ సీట్లలో సత్తా చాటుతుందని అంచనా వేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.


ఆగస్ట్ 2023లో తాజాగా 15 నుంచి 20 పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందని, అది కూడా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు లేకుండా అని సదరు ఛానల్ అంచనా వేసిన విషయాన్ని తెలుగు తమ్ముళ్లు హైలైట్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితి మరింత మారుతుందని, టీడీపీ మరిన్ని పార్లమెంట్ స్థానాల్లో సత్తా చాటడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వేకు సంబంధించిన వీడియో వైసీపీలో అంతర్గత చర్చకు దారితీసింది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తమకూ తెలుసని కానీ మరీ ఈ స్థాయిలో ఉందని అనుకోలేదని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అధినేత ఇప్పటికైనా మేలుకోవాలని.. పరిస్థితి ఇలానే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లోనే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బొక్కబోర్లాపడే పరిస్థితులు దాపురిస్తాయని వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా.. ఇదే జాతీయ ఛానల్ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఒక అంచనా వేసింది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో 4 సీట్లను ఎన్డీయే దక్కించుకునే అవకాశం ఉందని సర్వే చెప్పుకొచ్చింది. ఎన్డీయే ఓట్ షేర్ 23 శాతం ఉండొచ్చని తెలిపింది. కాంగ్రెస్ 7 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఓట్ షేర్ 38 శాతంగా వెల్లడించింది. ఇక.. 39 శాతం ఓట్ షేర్‌తో మిగిలిన 6 స్థానాల్లో ఇతర రాజకీయ పార్టీలు గెలిచే అవకాశం ఉందని సదరు జాతీయ ఛానల్ అంచనా వేసింది.

నరేంద్ర మోదీ మూడోసారి కూడా ప్రధానిగా బాధ్యతలు చేపడతారని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది కన్నా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఇండియా టుడే-సీఓటర్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ పేరుతో ఈ నెలలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. సర్వేలో 52 శాతం మంది ఈ విషయాన్ని చెప్పారు. 63 శాతం మంది ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

కొన్ని నెలల క్రితం జరిపిన సర్వేలో 72 శాతం మంది సంతృప్తి చెందగా ఇప్పుడు కాస్త తగ్గింది. మోదీ పనితీరు యావరేజ్‌గా ఉందని 13 శాతం మంది, బాగులేదని 22 శాతం మంది తెలిపారు. మోదీని చూసే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తామని 44 శాతం మంది చెప్పారు. అభివృద్ధి, హిందుత్వ అంశాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నా వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.

Updated Date - 2023-08-25T17:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising