ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Cases : చంద్రబాబు కేసులపై ఏసీబీ, హైకోర్టులో ఏం తేలుతుందో..!?

ABN, First Publish Date - 2023-10-18T11:26:36+05:30

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో 39 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోఉంటున్నారు. బాబును ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి...

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో 39 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోఉంటున్నారు. బాబును ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఏసీబీ, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులను చంద్రబాబు తరఫు లాయర్లు ఆశ్రయించారు. మరోవైపు ఆయన ఆరోగ్యంపై ఆందోళన, అంతకుమించి అనుమానాలు ఉండటంతో బాబును బయటికి తీసుకురావాలని సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. బుధవారం నాడు చంద్రబాబు కేసులపై ఏసీబీ, హైకోర్టులో విచారణ జరగనున్నది.


ఏసీబీ కోర్టులో ఇలా..

ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పీటీ వారెంట్‌పై నేడు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే.. మంగళవారం నాడు ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. అంతేకాదు.. విచారణ జరిగేదాకా బాబును అరెస్ట్ అరెస్ట్‌ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి కోర్డు సూచించింది. ఇప్పుడు అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు సీఐడీ తెలిపింది. అయితే.. చంద్రబాబును మళ్లీ ఎప్పుడు హాజరుపర్చాలి..? అనేది ఏసీబీ కోర్టు నేడు నిర్ణయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

హెల్త్ బులిటెన్‌ పిటిషన్‌పై..!

చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ పిటిషన్‌పై కూడా నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనున్నది. బాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ వేయాలని సీఐడీని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. నిన్న సాయంత్రం సీఐడీ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు ఏం చెబుతుంది..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఐఆర్ఆర్‌పై విచారణ..

మరోవైపు.. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనున్నది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది. కాగా.. సోమవారం నాడు ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ ముందస్తు బెయిల్ పొడిగించడం జరిగింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా అప్పటి వరకూ విచారించవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. తుది వాదనల కోసం ఈ నెల18 కి వాయిదా వేయడం జరిగింది. ఇవాళ వాదనలు విన్న తర్వాత ఏం జరగబోతోంది..? హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతున్నది..? అనేదానిపై టీడీపీ శ్రేణులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

Updated Date - 2023-10-18T11:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising