Telugudesam : టీడీపీలో చేరబోతున్న కన్నాపై వైసీపీకి ఎందుకింత పైత్యం.. ఏపీ మంత్రి ఇంత మాట అనేశారేంటి..!
ABN, First Publish Date - 2023-02-21T20:31:17+05:30
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ (Kanna lakshmi Narayana) కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుతో పొసగకపోవడంతో పార్టీకి రాజీనామా (Resignation) చేశారు..
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ (Kanna lakshmi Narayana) కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుతో పొసగకపోవడంతో పార్టీకి రాజీనామా (Resignation) చేశారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు..? టీడీపీ (Telugudesam) కండువా కప్పుకుంటారా.. లేకుంటే జనసేన (Janasena) తీర్థం పుచ్చుకుంటారా అనేది నాలుగైదు రోజులు పెద్ద సస్పెన్సే నడిచింది. ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చిన కన్నా.. ఫిబ్రవరి-23న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారు. ఆయన చేరికను బద్ధ శత్రువులు సైతం స్వాగతించారు కానీ.. వైసీపీ మంత్రులు, శ్రేణులకు అస్సలు రుచించడం లేదు. అదేదో సామెత ఉంది కదా.. అలా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. ఇటు వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి నోటికొచ్చినట్లు కన్నా గురించి మాట్లాడుతుంటే.. అటు వైసీపీ వీరాభిమానులు ఇష్టానుసారం ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఏకంగా ఓ మంత్రి మీడియా ముందుకొచ్చి కన్నా గురించి కీలక వ్యాఖ్యలే చేశారు. అసలు కన్నా గురించి ఇంతలా విమర్శించాల్సిన అవసరం వైసీపీకి ఏంటి..? ఆయనంటే వైసీపీ నేతలు ఎందుకింతలా కన్నెర్రజేస్తున్నారు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.
అసలెందుకిలా..?
వాస్తవానికి గత ఎన్నికల ముందే కన్నా వైసీపీలో చేరాలని రెడీ అయిపోయారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. తెల్లారితే వైఎస్ జగన్ (YS Jagan) సమక్షంలో కండువా కప్పుకునే వారే. అయితే రాత్రికి రాత్రే సీన్ మొత్తం మారిపోయింది. ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ కాల్స్ రావడం.. అప్పటికప్పుడే అధ్యక్ష పదవి కూడా ఇస్తామని ప్రకటన రావడంతో కన్నా మనసు మార్చుకున్నారు. అయితే.. అధ్యక్ష పదవి కట్టబెట్టినా ఏపీలో బీజేపీ పెద్దగా బలోపేతం కాలేదని ఆయన్ను తప్పించి ఆ తర్వాత సోమువీర్రాజు ఆ బాధ్యతలు అప్పగించింది. నాటి నుంచి కన్నాలో అసంతృప్తి మొదలైంది. అప్పట్లో మళ్లీ వైసీపీ వైపు చూశారని కూడా టాక్ నడిచింది.. కానీ ఎందుకో అది జరగలేదు. ఇలా రెండుసార్లు వైసీపీ చేరాలని వెనక్కి తగ్గడంతో వైసీపీ శ్రేణులకు కోపం వచ్చింది. దీంతో నాడు మొదలైన ట్రోల్స్.. ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి.
కౌంటర్ ఎటాక్..!
టీడీపీపై, అధినేత నారా చంద్రబాబుపై (Nara Chandrababu) అప్పట్లో కన్నా చేసిన కామెంట్స్ అన్నీ ఇన్నీ కావని.. ఆఖరికి ఆయనపై సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నది వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. అలాంటిది ఒక్కసారిగా అవన్నీ మరిచిపోయి, టీడీపీపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని వైసీపీ కార్యకర్తలు కొందరు సోషల్ మీడియా (Social Media) వేదికగా పైత్యం ప్రదర్శిస్తున్నారు. అయినా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరనేది కాస్త పాలిటిక్స్‌పైన అవగాహన ఉన్న వ్యక్తులు తరుచుగా చెబుతుంటారు. ఈ విషయం వైసీపీ శ్రేణులు తెలుసుకుంటే మంచిదేమో అని కౌంటర్ ఎటాక్ చేస్తోంది టీడీపీ. అయినా కత్తికి లేని దురద.. కందకు ఎందుకంటూ సామెతలు జోడించి మరి టీడీపీ కార్యకర్తలు కౌంటిర్లు ఇస్తున్నారు. ఇలా గత వారం రోజులుగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. వస్తే వైసీపీలోకి రావాలి.. లేకుంటే వేరే పార్టీలో చేరకూడదన్నదేనా మీ అభిప్రాయం అంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలకు ఏ మాత్రం తగ్గకుండా గట్టిగానే కౌంటర్లిస్తోంది టీడీపీ.
ఇలా అనేశారేం..?
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. (Gudivada Amarnath) రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించారు. ముందుగా గన్నవరం (Gannavaram) టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడి గురించి మాట్లాడిన ఆయన.. ఏ పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినా అది అప్రజాస్వామికమని తప్పుబట్టారు. ఇక కన్నా గురించి ప్రస్తావిస్తూ.. కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలోకి వెళ్లినా సున్నా అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. ఒకప్పుడు చంద్రబాబు గురించి ఏదోదే మాట్లాడిన వ్యక్తి.. ఇప్పుడు చంద్రబాబు దగ్గర పనిచేయాలని అనుకుంటూ ఉండటం విడ్డూరమని చెప్పుకొచ్చారు. ‘ ఎక్కడైనా గ్రౌండ్‌లో సభలు పెట్టుకోమంటే.. ఆయన సందులో పెడతాను అంటున్నారు. లోకేష్ పాదయాత్రకు (Lokesh Padayatra) 500మంది పోలీసు భద్రత ఇచ్చాం. వచ్చే జనాలు కంటే పోలీసులే ఎక్కువ ఉంటున్నారు. లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా వైసీపీకి డోకా లేదు’ అని అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
ఈ వార్నింగ్‌లు ఏంటో..!
కన్నా టీడీపీలో చేరికపై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు (Mayor Kavati Manohar Naidu) స్పందించారు. ‘ బీజేపీ తిరస్కరించిన నేత కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్ మీద కన్నా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. గతంలో కన్నా వైసీపీలో చేరాలనుకోలేదా..?. వైసీపీలో చేరకుండా బీజేపీ బెదిరించిందా లేక డబ్బులిచ్చిందా..?. వంగవీటి రంగాను (Vangaveeti Ranga) చంపించింది చంద్రబాబే అని కన్నా అనలేదా..?. చంద్రబాబు అవినీతిపై కేసులు పెట్టి గగ్గోలు పెట్టింది కన్నానే కదా....? వైసీపీని, సీఎంను విమర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రాయపాటితో రాజీ పడింది కన్నా కాదా....?. ఎన్ని కోట్లు తీసుకొని రాయపాటితో (Rayapati) రాజీ పడ్డారో చెప్పాలి....? జనసేనతో కూడా మంతనాలు కన్నా మంతనాలు చేశారు. సీఎం జగన్‌పై విమర్శలు చేస్తే ఉపేక్షించం. మొదట మాటలతోనే చెబుతాం.. తర్వాత ఏదైనా జరగవచ్చు’ అని మేయర్ ఏకంగా వార్నింగ్ ఇచ్చారు.
అయినా.. టీడీపీలో చేరే వ్యక్తికి.. చేర్చుకునే అధిష్టానానికి లేని ఇబ్బంది వైసీపీకి ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్న. అయినా ఇంత హడావుడి చేయాల్సిన అవసరమేంటో వాళ్లకే తెలియాలి మరి. టీడీపీలో చేరకముందే జగన్ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచిన కన్నా.. వైసీపీ విమర్శలపై ఏ రేంజ్‌లో రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..
YSRCP ALI : ఆ నాలుగు నియోజకవర్గాలపై అలీ కన్ను.. సొంతంగా సర్వేలు.. టికెట్ ఇస్తే చాలు గెలిచేస్తానని ధీమా.. అన్నీ సరే అయ్యే పనేనా..!?
**********************************
AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?
**********************************
YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!
**********************************
MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..
**********************************
#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!
**********************************
BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..
**********************************
MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి
**********************************
#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..
**********************************
TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!
**********************************
Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!
**********************************
TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!
Updated Date - 2023-02-21T21:08:01+05:30 IST