ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

ABN, First Publish Date - 2023-05-01T14:46:39+05:30

థాయిలాండ్‌‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ను (Chikoti Praveen) పటాయ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అరెస్ట్ గురించి తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) తెగ చర్చించుకుంటున్నారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థాయిలాండ్‌‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ను (Chikoti Praveen) పటాయ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అరెస్ట్ గురించి తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) తెగ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన వారిలో ఏపీ, తెలంగాణకు (Andhra Pradesh, Telangana) చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే కొందరి పేర్లు కూడా బయటికి బయటికి వచ్చాయి. చికోటితో పాటు మాధవరెడ్డి (Madhava Reddy) , డిసీసీబి చైర్మన్ దేవేందర్ రెడ్డి (Devender Reddy) కూడా పోలీసుల అదుపులోఉన్నారు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఈ గ్యాంబ్లింగ్ ముఠాలో ఏపీలోని కృష్ణా జిల్లాకు (Krishna District) చెందిన కొందరు ప్రముఖులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వారంతా గన్నవరం (Gannavaram) నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు (YSRCP Leaders) అన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గన్నవరంకు చెందిన మొత్తం 16 మంది మూడ్రోజుల క్రితం పటాయ వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ 16 మంది ఎప్పుడూ పటాయ వెళ్లే గ్యాంగ్‌లో ఉండేవారేనని స్థానికులు చెబుతున్నారు. గుడివాడతో పాటు, మరికొన్ని ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ గ్యాంగ్‌లో ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పట్టుబడింది వీరేనా..?

థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతూ పట్టుబడిన వారిలో ఈ ఆటలో ఆరితేరిన కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన తిరుమలరావు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇతను ఒక ఆటకు 20 కోట్లు పెట్టి ఆడతాడని తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లాకు చెందిన బిల్డర్ కొప్పడ మధుసూదన్, మల్లికార్జున రావు, మధు, సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ రాజకేయనేతలు ఉన్నట్టు సమాచారం. జూదగాళ్ల నుంచి మొత్తం 100 కోట్ల రూపాయిలు పట్టుబడినట్లు సమాచారం.

కుటుంబీకుల్లో ఆందోళన..

కాగా.. ఇప్పటికే క్యాసినోలో బ్లాక్‌జాక్స్, బకారత్ గేమ్‌లలో పట్టుబడిన ఆంధ్రావాసులు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పటాయలో చట్ట విరుద్దంగా ఈ గేమ్‌లు ఆడుతున్నట్టు పక్కా సమాచారం రావడంతో అండర్ కవర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా చీకోటి, ఆయన గ్యాంగ్‌తో సహా మొత్తం 93 మందిని అరెస్ట్ చేశారు. మూడ్రోజుల క్రితం థాయ్‌ల్యాండ్‌కు మూడు గ్యాంబ్లింగ్ బ్యాచ్‌లను నిర్వాహకులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులను చూసిన ఈ గ్యాంగ్ పారిపోయేందుకు యత్నించగా రౌండప్ చేసి పట్టుకున్నట్లుగా సమాచారం. ఈ గ్యాంబ్లింగ్‌లో చీకోటి ప్రవీణ్‌ ప్రధాన సూత్రదారి అని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో చట్టాలు కఠినంగా ఉంటాయని తెలియడంతో పట్టుబడిన గ్యాంబ్లింగ్ బ్యాచ్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

కీలకంగా వ్యవహరించిన మహిళ..

ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో సీతర్నన్ కేల్వేల్కర్ అనే మహిళ కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె కూడా పోలీసుల అదుపులోనే ఉంది. అరెస్టయిన వారిలో మొత్తం 14 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం చికోటి, సీతర్నన్‌ను ప్రత్యేక పోలీసుల బృందం లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పటాయ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోట్లల్లో నగదు, 20 కోట్ల రూపాయిలు విలువచేసే గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క ఇండియన్ నుంచి గ్యాంబ్లింగ్ కోసం లక్షల్లో వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 27 నుంచి థాయ్‌లోని ఓ హోటల్‌లో చికోటి కాన్ఫరెన్స్ హాల్‌ను అద్దెకు తీసుకుని ఈ తతంగం నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ అరెస్ట్ అయిన వారిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? ఏ ప్రాంతాలకు చెందిన వారు..? తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మొత్తం ఎంత మంది ఉన్నారు..? అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

******************************

New Secretariat : కొత్త సచివాలయంకు వెళ్లిన ఉద్యోగుల్లో గందరగోళం.. తొలిరోజు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..

******************************

YSRCP : బాబోయ్.. కొడాలి నానీని పేర్ని నాని పొగిడారా.. గాలి తీశారా.. ఏమిటీ మాటలు..!?

******************************

Updated Date - 2023-05-01T14:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising