ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

ABN, First Publish Date - 2023-03-25T18:40:42+05:30

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఏపీలో ఏం జరగబోతోంది..? రానున్న ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల సంగతేంటి..?..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఏపీలో ఏం జరగబోతోంది..? రానున్న ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల సంగతేంటి..? ఇదే విషయాలపైనే చర్చించుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంగతి పక్కనెడితే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మాత్రం క్రాస్ ఓటింగ్ జరగడంతోనే వైసీపీ ఎమ్మెల్యే ల ఓట్లు టీడీపీ అభ్యర్థికి పడటంతో పంచుమర్తి అనురాధ (Panchumarthy Anuradha) గెలుపొందారు. దీంతో.. అలా ఫలితాలు వచ్చాయో లేదో 24 గంటల్లోనే పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ram Narayana Reddy), ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy)లపై వైసీపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు.. క్రాస్ ఓటింగ్ (Cross Voting) వేసిన ఎమ్మెల్యేలంతా 10 నుంచి 20 కోట్ల రూపాయిల వరకూ అమ్ముడుపోయారని కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) సంచలన ఆరోపణలే చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటికే మేకపాటి, కోటంరెడ్డి మీడియా వేదికగా స్పందించగా.. తాజాగా మరోసారి నెల్లూరు రూరల్‌లోని తన ఆఫీసులో మీడియా మీట్ నిర్వహించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా అసలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (YS Jagan Mohan Reddy) గ్యాప్ ఎందుకు ఎలా వచ్చింది..? సజ్జల ఆరోపిస్తున్నట్లు 20 కోట్ల డీల్ ఏంటి..? వైసీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు..? ఎంతమంది పార్టీని వీడతారనే విషయాలపై శ్రీధర్ రెడ్డి నిశితంగా వివరించారు.

జగన్‌తో ఎక్కడ చెడింది..?

నేను మూడు తరాలుగా వైఎస్ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నాను. కష్టాల్లో పార్టీకి విధేయుడిగా ఉన్నాను. వైఎస్ రాజారెడ్డి (YS Raja Reddy), వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Reddy) కి నేను నమ్మకమైన వ్యక్తిగా.. కార్యకర్తగా ఉన్నాను. అలాంటి నేను ప్రజా సమస్యలను పరిష్కరించాలని నేను గట్టిగా అడిగాను. ప్రజల నుంచి ఎంత ఒత్తిడి ఉంటే.. శ్రీధర్ రెడ్డి ఇంతలా అడుగుతున్నారని వైఎస్ జగన్ అనుకోలేదు. నేను అడిగిన ఈ సమస్యలను ప్రజా సమస్యలుగా చూడకుండా రాజకీయ కోణంలో చూశారు. అందుకే అప్పట్నుంచీ అధిష్ఠానం నన్ను అనుమానిస్తూ వస్తోంది. అసలు అనుమానం ఉన్నచోట నేను ఉండకూడదని ఆత్మ గౌరవంతో రెండు నెలల ముందే నేను వైసీపీకి (YSR Congress) దూరమయ్యాను. మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మకం సన్నగిల్లిందనే నేను బయటికొచ్చేశాను. నాటి నుంచి నేటి వరకూ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా నేను లేను. అలాంటప్పుడు నన్ను సస్పెండ్ చేయడం సమర్థనీయమే.. నేను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా.. ఏం చేసినా వెనకడుగు వేసేది లేదు. ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాను. 2024 ఎన్నికల్లో రాజకీయ సునామీ రాబోతోంది. అప్రజాస్వామిక పద్ధతిలో, అధికార మదంతో వెళ్తున్నటువంటి వైసీపీని రానున్న 2024 ఎన్నికల్లో (2024 Elections) శాశ్వతంగా ఏపీ రాజకీయాల్లో నుంచి డిస్మిస్ చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరోసారి చెబుతున్నా వైసీపీని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఓటమి ప్రజానాడి ఏంటో చాటి చెబుతోంది. నేను నమ్మకంగా, విశ్వాసంగా చెబుతున్నా రాసిపెట్టుకోండి.. 2024 ఎన్నికల కౌంటింగ్ రోజు సాయంత్రం మనం (మీడియా ప్రతినిధులతో) మాట్లాడుకుందాం. ఈ వీడియో క్లిప్ మీ దగ్గరే పెట్టుకోండి ఫలితాల తర్వాత మాట్లాడుకుందాంఅని కోటంరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

20 కోట్లు ఇచ్చారన్న ఆరోపణలపై..!

నేను ఆత్మప్రభోదానుసారమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశాను. నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. వైసీపీ అభ్యర్థులకు ఓటేయమని అధిష్ఠానం కానీ పార్టీ పెద్దలు కానీ నాకు చెప్పలేదు. తెలుగుదేశం (Telugudesam) వాళ్లు కూడా నన్ను అడగలేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పారు.. శ్రీధర్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేనే కాదు అని. ఏమయ్యా సజ్జలు.. నీది నోరా.. నాలుకా లేకుంటే తాటి మట్టా. ఆ రోజు మా పార్టీ ఎమ్మెల్యేనే కాదని.. ఇప్పుడు సస్పెన్షన్, క్రాస్ ఓటింగ్ అని ఎలా మాట్లాడతావ్..?. అసలు నేను అమ్ముడుపోయానని మీరెలా మాట్లాడుతారు..?. నేను అమ్ముడుపోయి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను మీరు ఎంతపెట్టి కొన్నారో కూడా చెబితే బాగుంటుంది. అదేవిధంగా టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యే.. వైసీపీకి ఓటేశారని సజ్జల చెప్పారు. ఆ ఐదుమంది ఎమ్మెల్యేలకు మీరు (సజ్జల) ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది చెప్పాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు అంగీకరించరుఅని కోటంరెడ్డి హెచ్చరించారు.

పార్టీ మారే ఎమ్మెల్యేల గురించి..!

నేను ఇంకా రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీడియా మిత్రులు, అనుచరులు, కార్యకర్తలు అందరితో చెబుతాను. వైసీపీ నుంచి ఎంతమంది బయటికొస్తారనే విషయం నేను చెప్పలేను కానీ.. అసంతృప్తిగా ఉన్నారన్న మాట వాస్తవం. చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. ఆ అసంతృప్తిని కొందరు బాహాటంగా వెల్లగక్కుతుండగా.. మరికొందరు లోలోపల ఉడికిపోతున్నారు. వైసీపీలో (YSRCP) ఇమడలేక వేరే పార్టీలో చేరేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటికి రావాలంటే చేరే పార్టీలో ఏ మాత్రం మనకు స్థానం ఉంటుంది అని ఆలోచిస్తారు. అవకాశం దొరికినప్పుడు ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు కచ్చితంగా బయటికొస్తారు. ఎమ్మెల్యేల విషయం పక్కనెడితే.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తడ నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజలంతా వైసీపీని రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా డిస్మిస్ చేస్తారు. ఈ విషయాన్ని నేను ఎంతో నమ్మకంగా చెబుతున్నానుఅని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు.

మొత్తానికి చూస్తే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలో రాదు.. శాశ్వతంగా ప్రజలే డిస్మిస్ చేస్తారని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాదు.. ఈ వీడియో క్లిక్ కట్ చేసి పెట్టుకోండి ఫలితాల తర్వాత మాట్లాకుందామని ఓపెన్ ఛాలెంజ్ (Open Challange) చేస్తున్నారు. అసలు ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో.. అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నారో తెలియాలంటే.. ఫలితాల వరకూ వేచి చూడక తప్పదు మరి.

****************************

ఇవి కూడా చదవండి

******************************

AP Politics : ఏపీలోని ఆ జిల్లాలో ముసలం పుడితే.. అధికార పార్టీ అడ్రస్ గల్లంతే.. ఒక్కసారి చరిత్ర చూస్తే...

******************************

YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!

******************************

Suspension on 4 MLAs : వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన నిమిషాల వ్యవధిలోనే జరిగిన సీన్ ఇదీ.. నిరూపిస్తారా..!

******************************

Big Breaking : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

******************************

MLC Election Results : క్రాస్ ఓటింగ్ వేసిందెవరో తెలుసన్న సజ్జల.. ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్షన్ ఇదీ.. ఇవాళ ఉదయమే...

******************************

MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలేనా.. ఫోన్ స్విచాఫ్ రావడంతో...!


******************************

Updated Date - 2023-03-25T18:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising