Age vs Weight: మీ వయసెంత..? మీరు ఉన్న బరువెంత..? వయసుకు తగ్గ బరువే ఉన్నారా..? లేదో చెక్ చేసుకోండి..!

ABN , First Publish Date - 2023-08-13T13:03:36+05:30 IST

ఇన్నాళ్లు బరువు విషయంలో చాలామంది ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు గురించి మాట్లాడేవారు. దానికి అనుగుణంగానే బరువు మెయింటైన్ చేయాలని చూసేవారు. కానీ వయసుకు తగ్గ బరువు గురించి మీకు తెలుసా? ఏ వయసు వారు ఎంత బరువు ఉండాలో తెలుసా?

Age vs Weight: మీ వయసెంత..? మీరు ఉన్న బరువెంత..? వయసుకు తగ్గ బరువే ఉన్నారా..? లేదో చెక్ చేసుకోండి..!

శరీర ఆరోగ్యం విషయంలో బరువు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అధిక బరువు గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తే తక్కువ బరువు పోషకాహార లోపం, బలహీనత, అనేక వ్యాధుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. ఇన్నాళ్లు బరువు విషయంలో చాలామంది ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు గురించి మాట్లాడేవారు. దానికి అనుగుణంగానే బరువు మెయింటైన్ చేయాలని చూసేవారు. కానీ వయసుకు తగ్గ బరువు గురించి మీకు తెలుసా? ఏ వయసు వారు ఎంత బరువు ఉండాలో తెలుసా? ఎత్తుకు తగ్గ బరువు గురించి కాదు.. వయసుకు తగ్గ బరువు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది తెలుసుకున్న తరువాత బరువు తగ్గాలా లేదా పెరగాలా అనే విషయం ఎవరికి వారు డిసైడ్ చేసుకోవచ్చు.ఇంతకీ ఏ వయసువారు ఎంత బరువు ఉండాలంటే..

పుట్టిన పిల్లలను బరువు తూచడం సహజం. నవజాత శిశువు 3.3కిలోల బరువు దాకా ఉండాలి. ఆ తరువాత 9నెలల నుండి 1సంవత్సరంలోపు పిల్లల బరువు 10కిలోల వరకు ఉండాలి. 2ఏళ్ళ నుండి రెండున్నర ఏళ్ళ మగపిల్లల బరువు 12.5కిలోలు ఉండాలి. ఆడపిల్లలు అయితే 11.8కిలోల బరువు ఉండాలి. 6నుండి 8 ఏళ్ళ మగపిల్లల బరువు 14నుండి 17కిలోలు ఉండాలి. 9నుండి 11ఏళ్ళ మగపిల్లలు 28నుండి 31కిలోల బరువుండాలి. 12నుండి 14 ఏళ్ళ వయసులో ఉన్నవారు 32నుండి 38కిలోల బరువు ఉండవచ్చ. ఆడపిల్లలు అయితే 32నుండి 36కిలోల బరువు ఉండాలి. 15నుండి 20 ఏళ్ళ లోపు మగపిల్లలు 40నుండి 50 కిలోల బరువు ఉండాలి. ఆడపిల్లలు అయితే 45కిలోలు ఉండాలి.

Smartphone: ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ పేలిపోవడం ఖాయం..!


ఇక 20ఏళ్లు దాటిన తరువాత బరువు విషయంలో చిన్న చిన్న మార్పులు ఏమీ ఉండవు. ధీర్ఘకాలంగా పదేళ్ళపాటు ఒకేబరువు కొనసాగుతుంది. 20నుండి 30ఏళ్ళ వయసున్న మగవారు 60 నుండి 70కిలోల బరువు ఉండొచ్చు. అదే ఆడవారు అయితే 50నుండి 60కిలోలు ఉండచ్చు. 30నుండి 40ఏళ్ళ మగవారు 59నుండి 75కిలోల దాకా బరువు ఉండచ్చు. ఆడవారు అయితే 60నుండి 65 కిలోలు ఉండాలి. 41నుండి 50ఏళ్ళలోపు మగవారి బరువు 60 నుండి 70కిలోలు ఉండాలి. ఆడవారు అయితే 59నుండి 63కిలోలు ఉండాలి. ఈ గణాంకాలు చూసుకున్న తరువాత వయసు.. వయసుకు తగ్గ బరువు ఉన్నామా లేదా చూసుకుని దానికి తగ్గినట్టు బరువు తగ్గడం లేదా పెరగడం మంచిది.

Papaya Seeds: అమ్మ బాబోయ్.. బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలా..? తెలియక ఎన్ని సార్లు పారేసి ఉంటారో..!


Updated Date - 2023-08-13T13:03:36+05:30 IST