Pragathi Bhavan KTR: ప్రగతి భవన్‌లో కేటీఆర్ వేరు కాపురమా?.. ఆ నాయకుడు అంత మాట అనేశారేంటీ..
ABN , First Publish Date - 2023-02-10T16:04:37+05:30 IST
ఎం కేసీఆర్‌తోనే (CM KCR) మంత్రి కేటీఆర్ (KTR) కుటుంబం కూడా ప్రగతి భవన్‌లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రగతి భవన్‌లోనే కేటీఆర్ వేరు కాపురం పెట్టారా..? కేసీఆర్, కేటీఆర్‌లు వేర్వేరుగా ఉంటూ బయటకు తెలియనివ్వటం లేదా?...
సీఎం కేసీఆర్‌తోనే (CM KCR) మంత్రి కేటీఆర్ (KTR) కుటుంబం కూడా ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రగతి భవన్‌లోనే కేటీఆర్ వేరు కాపురం పెట్టారా..? కేసీఆర్, కేటీఆర్‌లు వేర్వేరుగా ఉంటూ బయటకు తెలియనివ్వడం లేదా...? కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చెందిన ఓ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఈ సందేహాలకు తావిచ్చాయి. అసలు ఆ సీనియర్ నాయకుడు ఎవరు?, ప్రగతి భవన్‌పై ఆయనేమన్నారో ఒక లుక్కేద్దాం...
ప్రగతి భవన్... తెలంగాణలో (Telangana) ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రం. కట్టి ఎన్నేండ్లయినా రాజకీయంగా ప్రగతిభవన్‌పై విమర్శలు ఆగవు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ (BRS) నేతలు ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోరు. ప్రగతి భవన్‌లో కేసీఆర్ నివాసముంటుండగా, మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా అక్కడే ఉంటారు. అయితే, ఇందులో అసలు నిజం వేరే ఉందన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రగతి భవన్‌లోనే సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉంటున్నప్పటికీ... అక్కడ వేర్వేరుగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. సీఎంగా కేసీఆర్ కట్టిన ప్రగతి భవన్‌లో కేవలం కేసీఆర్ ఆయన భార్య మాత్రమే ఉంటున్నారని, గతంలో సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న ఇంటిని కేటీఆర్ కుటుంబం వాడుకుంటుందని ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఈ విషయం మాములు వ్యక్తులు బయటపెడితే ఎవరూ నమ్మేవారు కాదేమో. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) కామెంట్ చేయటంతో నిజమేనా అన్న చర్చ జరుగుతోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌కు అంత పెద్ద ప్రగతి భవన్ అవసరమా? ప్రజాధనం దుర్వినియోగం చేసి కట్టారని విమర్శించారు. కేసీఆర్ ఉండేందుకు డబుల్ బెడ్ రూం సరిపోతుందన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉంటుంటే, అదే కాంపౌండ్‌లో ఉన్న బిల్డిండ్‌లో కేటీఆర్ ఉంటున్నారని, గతంలో ఆ భవనంలో సీఎం వైఎస్ ఉండేవారని చెప్పుకొచ్చారు. మరి.. ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు తెలియాలంటే కేటీఆర్ కానీ ఆయన సన్నిహితులు కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతారో లేదో చూడాలి.