WhatsApp: వాట్సాప్ యూజర్లకు పండగలాంటి వార్త.. ఇకపై ఆ ఇబ్బంది గురించి నో టెన్షన్..!

ABN , First Publish Date - 2023-05-26T20:22:36+05:30 IST

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ నిత్యం వినియోగించే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. టెక్ట్స్ మెసేజ్‌లు, ఆడియో, వీడియో కాల్స్.. ఇలా నిముష నిముషానికీ వాట్సప్ ఓపెన్ చేస్తూనే ఉంటారు. ఒక్క రోజు వాట్సప్ పని చేయకపోతే దిక్కతోచని పరిస్థితి. యూజర్ల సౌలభ్యం కోసం గతంలో..

WhatsApp: వాట్సాప్ యూజర్లకు పండగలాంటి వార్త.. ఇకపై ఆ ఇబ్బంది గురించి నో టెన్షన్..!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ నిత్యం వినియోగించే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. టెక్ట్స్ మెసేజ్‌లు, ఆడియో, వీడియో కాల్స్.. ఇలా నిముష నిముషానికీ వాట్సప్ ఓపెన్ చేస్తూనే ఉంటారు. ఒక్క రోజు వాట్సప్ పని చేయకపోతే దిక్కతోచని పరిస్థితి. యూజర్ల సౌలభ్యం కోసం గతంలో కంటే వాట్సప్‪‌లో అనేక సదుపాయాలు తీసుకొచ్చారు. ఇప్పటివరకూ ప్రొపైల్ పిక్, పేరు, అబౌట్, ఫోన్ నంబర్ కనిపించే వెలుసుబాటు ఉంది. త్వరలో ‘@’ సింబల్‌తో మొదలయ్యే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారని, భవిష్యత్‪‌లో అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది.

వాట్సాప్ (WhatsApp) అందుబాటులోకి వచ్చిన కొత్తలో కేవలం చాటింగ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. అనంతరం కాలంలో యూజర్ల సౌలభ్యం కోసం ఆడియో, వీడియో కాలింగ్ (Audio and video calling) , ప్రొఫైల్ ఫొటో, అబౌట్ తదితర ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోజు రోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీని (Technology) దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను (New feature) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ‘@’ సింబల్‌తో మొదలయ్యేలా యూజర్ నేమ్‌ను (User name) క్రియేట్ చేసుకోవచ్చు.

Viral Video: మట్టి కుండలతో.. చిన్న ట్రిక్‌తో కూలర్ నుంచే ఏసీని మించిన కూలింగ్.. అసలు ఎలా సాధ్యమో మీరే చూడండి..!

WhatsApp-new.jpg

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులకు నంబర్ బదులుగా యూజర్ ఐడీ (User ID) మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ఫోన్ నంబర్ (phone number) కనిపించకుండా.. కేవలం యూజర్ ఐడీతోనే చాటింగ్ చేయొచ్చా.. లేక నంబర్ కూడా కనపడుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, త్వరలో ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి రానుంది. ఏది ఏమైనా ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గోప్యత విషయంలో.. యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. మామిడిపండ్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూస్తే..!

Updated Date - 2023-05-26T20:22:36+05:30 IST