ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు పక్కన సబ్బు పెట్టెలు అమ్ముకుంటున్న యువతి అరెస్ట్.. అదేంటని అడిగితే ప్రెస్‌మీట్ పెట్టి మరీ పోలీసులు చెప్పింది విని అంతా షాక్..!

ABN, First Publish Date - 2023-02-15T16:59:13+05:30

ఆమె ఫేస్ చూస్తే ఎవరూ అలా అనుకోరు. అమాయకురాలు. ఏ పాపం తెలియదు. ఉద్యోగం లేదు. ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బ్రతుకుతుంది. ఆ ఊరు వారందరి అభిప్రాయం అదే. కానీ ఏం జరిగిందో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోకుండా

పోలీసులు చెప్పింది విని అంతా షాక్..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అన్నాడో కవి. నిజమే ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇవి ఎంత విలువైనవో.. అంతే ప్రమాదకరం. ఇప్పుడిదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఆమె ఫేస్ చూస్తే ఎవరూ అలా అనుకోరు. అమాయకురాలు. ఏ పాపం తెలియదు. ఉద్యోగం లేదు. ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బ్రతుకుతుంది. ఆ ఊరు వారందరి అభిప్రాయం అదే. కానీ ఏం జరిగిందో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. అర్రెర్రె.. ఆమేనా? అంత పని చేసిందా? అనుకుంటారు.

ఇది కూడా చదవండి: తప్పు వరుడిదే.. సారీ చెబుతామన్నా వినని వధువు.. నాకీ పెళ్లి వద్దంటూ తేల్చేసింది.. అసలేం జరిగిందంటే..

మిజోరం (Mizoram) ఐజ్వాల (Aizawl)లోని రంగ్వమ్వాల్‌ (Rangvamual)లో ఓ యువతి (young woman) నివాసం ఉంటోంది. ఉద్యోగం ఏదీ లేదు. అక్కడే ఓ సెంటర్‌లో ఖాళీ సబ్బు పెట్టెలు (Soap boxes) అమ్ముకుంటోంది. ఒక్కో పెట్టెను 10 రూపాయిలకు విక్రయిస్తోంది. ఇలా ప్రతీ రోజూ సబ్బు పెట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. అలాంటి ఆమెను రాత్రి సడన్‌గా జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (District Special Branch police) వచ్చి అరెస్ట్ (arrested) చేసి తీసుకుపోయారు. అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న సబ్బు పట్టెలు కూడా తీసుకుపోయారు. ఇదంతా చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అరే ఆమెను ఎందుకు అలా పట్టుకుపోతున్నారు? ఏం చేసిందని? సబ్బు పెట్టెలు అమ్ముకోవడం తప్పా? రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై అమ్ముతోందని పట్టుకుపోతున్నారా? ఇలా చుట్టుప్రక్కల వారికి అనేక డౌట్స్ వచ్చాయి. కానీ పోలీసుల్ని అడిగేంత సాహసం ఎవరూ చేయలేకపోయారు.

స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి షాకింగ్ విషయం చెప్పడంతో వారంతా ఖంగుతిన్నారు. యువతి లల్రామ్మావీ సబ్బు పెట్టెల్లో (soap cases) డ్రగ్స్ అమ్ముతోందని వెల్లడించారు. ఆమె సోప్ బాక్సులు అమ్మడం లేదనీ.. అందులో హెరాయిన్ పెట్టి విక్రయిస్తోందని చెప్పుకొచ్చారు. వాటి విలువ రూ.1.19 కోట్లు (seized drug) ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో ఆశ్చర్యపోవడం.. అక్కడున్న మీడియా ప్రతినిధుల వంతైంది.

ఇది కూడా చదవండి: Papaya Seeds: ఈ గింజల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

Updated Date - 2023-02-15T16:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising