Holidays in November: అక్టోబర్‌లోనే కాదండోయ్.. నవంబర్‌లోనూ సెలవుల పండగే.. స్కూళ్లకు, కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులంటే..!
ABN, First Publish Date - 2023-11-01T15:52:57+05:30
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్కూళ్లు, కళశాలకు సెలవులు ప్రకటించడంతో ఇన్నాళ్లూ విద్యార్థులకు ఆటవిడుపు దొరికింది. అయితే ఈ నవంబర్‌లో విద్యార్థులకు అనేక సెలవులు రానున్నాయి. ఒక విధంగా ఈ వార్త విద్యార్థులకు శుభవార్త వంటిందే. అయితే అక్టోబర్‌లోనే కాకుండా ఈసారి...
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్కూళ్లు, కళశాలకు సెలవులు ప్రకటించడంతో ఇన్నాళ్లూ విద్యార్థులకు ఆటవిడుపు దొరికింది. అయితే ఈ నవంబర్‌లో విద్యార్థులకు అనేక సెలవులు రానున్నాయి. ఒక విధంగా ఈ వార్త విద్యార్థులకు శుభవార్త వంటిందే. అయితే అక్టోబర్‌లోనే కాకుండా ఈసారి నవంబర్‌లో మాత్రం ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఎక్కువ సెలవులు ఉన్నాయి. ఇంతకీ ఎప్పుడెప్పుడు, ఏయే సెలవులు ఉన్నాయనే వివరాల్లోకి వెళ్తే..
స్కూళ్లు, కళాశాలకు ఈ నవంబర్‌లో (November) చాలా సెలవులు ఉన్నాయి. దసరా తర్వాత దేశ వ్యాప్తంగా జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి (Diwali) కూడా ఈ నెలలోనే వచ్చింది. ముందుగా నవంబర్ 5న ఆదివారం కాబట్టి ఎలాగూ (Schools and Colleges) స్కూళ్లు, కళాశాలలకు సెలవు. తర్వాత 11వ తేదీ రెండో శనివారం కొన్ని స్కూళ్లు, కళాశాలకు సెలవు ఉంటుంది. ఆ మరుసటి రోజు.. అంటే ఇక నవంబర్ 12న దీపావళి కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు (holidays) వచ్చాయి. అయితే దీపావళి ఆదివారమే రావడంతో చాలా మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు నిరాశతో ఉన్నారు. శనివారం లేదా సోమవారం వచ్చుంటే ఇంకో రోజు సెలవు కలిసి వచ్చుండేదని చర్చించుకుంటున్నారు. ఇదిలావుండగా.. కొన్ని స్కూళ్లు, కళాశాలలకు నవంబర్ 13న సెలవు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.
Viral Video: మెట్రో రైల్లో హద్దులు దాటిన ప్రేమ జంట... అంతా చూస్తున్నారనే కనీస జ్ఞానం కూడా లేకుండా..
మరోవైపు నవంబర్ 14న చిల్డ్రన్స్ డే కాబట్టి (Children's Day) .. చాలా స్కూళ్లు, కళాశాలలకు ఎలాగూ సెలవు ఉంటుంది. నవంబర్ 19న ఆదివారం, 25న నాలుగో శనివారం కావడంతో పలు స్కూళ్లు, కళాశాలలకు సెలవు ఉంటుంది. అలాగే నవంబర్ 26న ఆదివారం, 27న గురునానక్ జయంతితో పాటూ కార్తీక పౌర్ణమి వచ్చింది. దీంతో ఈరోజు కూడా సెలవు ఉండే అవకాశం ఉంది. ఇదిలావుండగా పాఠశాలలు, కళాశాలల్లో ఒక్కోచోట ఒక్కోలా సెలవులు ఉంటాయి. ఇక ప్లేస్కూళ్లకు మరిన్ని సెలువులు ఉండే అవకాశం ఉంది. ఇదిలావుండగా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లోనే ఉండడంతో 29, 30న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ లెక్కన నవంబర్‌లో స్కూళ్లు, కళాశాలలకు 10 నుంచి 12 రోజులు సెలవులు వచ్చాయి.
Updated Date - 2023-11-01T15:57:13+05:30 IST