Sharwanand: పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా..?

ABN , First Publish Date - 2023-01-24T21:02:12+05:30 IST

శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. అతడి నిశ్చితార్థం జనవరి 26న జరగబోతున్నట్టు సమాచారం. ఏప్రిల్‌లో పెళ్లి చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది.

Sharwanand: పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో శర్వానంద్ (Sharwanand) ఒకరు. ఈ యంగ్ హీరో త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. అతడి నిశ్చితార్థం జనవరి 26న జరగబోతున్నట్టు సమాచారం. ఏప్రిల్‌లో పెళ్లి చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది. శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు తాజాగా బయటికి వచ్చాయి.

శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి (Rakshita Reddy). ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డికి కుమార్తె అని సమాచారం. టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి మనవరాలు అవుతుందని తెలుస్తోంది. రక్షిత అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటుందని దగ్గరి వారు చెబుతున్నారు. ఆమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుందట. శర్వా ఆమెని ఒక స్నేహితుడి ద్వారా కలిశాడట. అనంతరం ఆలోచనలు, అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇరువైపుల పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇక శర్వానంద్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘ఒకే ఒక జీవితం’ లో నటించాడు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది.

Updated Date - 2023-01-24T21:02:14+05:30 IST

News Hub