Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా బాబూ.. సైకిల్‌ను కూడా ఎలా మార్చేశారో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-07-03T10:44:19+05:30 IST

సాధారణ వ్యక్తి మెదడు అద్బుతాల పుట్ట లాంటిది. అవసరానికి తగ్గట్టు ఎలాంటి వస్తువునైనా తనకు నచ్చినట్టు మార్చేస్తాడు.

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా బాబూ.. సైకిల్‌ను కూడా ఎలా మార్చేశారో మీరే చూడండి..!

మనిషి ప్రతిభకు కొలమానాల్లేవు. అందుకే మనిషిని ఈ సృష్టిలోకెల్లా అదృష్టవంతుడని అంటారు. మనిషి మేధస్సు నుండి పుట్టే ఆలోచనలు, అందులో నుండి జరిగే ఆవిష్కరణలు ఎప్పుటికప్పుడు ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంటాయి. ఇక కామన్ మ్యాన్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. సాధారణమైన వస్తువులను అద్భుతంగా మార్చడం కామన్ మ్యాన్ కు ఉన్న ట్యాలెంట్. ఓ వ్యక్తి తన సైకిల్ ను మార్చేసిన విధానం చూస్తే అవాక్కవుతారు. ఈ సైకిల్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఆవిష్కరణలు(inventions) ఇంజనీర్ల చేతుల్లో, సైంటిస్ట్ ల ఆలోచనల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే.. సాధారణ వ్యక్తి మెదడు అద్బుతాల పుట్ట లాంటిది. అవసరానికి తగ్గట్టు ఎలాంటి వస్తువునైనా తనకు నచ్చినట్టు మార్చేస్తాడు. ఓ వ్యక్తి తన సైకిల్(bicycle) ను ఇలానే మార్చేశాడు. సైకిల్ ను తొక్కుకుంటూ వెళ్ళడం అందరికీ అంత ఈజీ కాదు. వయసులో ఉన్నవాళ్ళు తొక్కినంత చురుగ్గా, ఎక్కువ దూరం సైకిల్ తొక్కలేరు పెద్దవాళ్ళు. ఈ కారణంగా ఒక వ్యక్తి తన సైకిల్ కు మోటార్ సైకిల్ ఇంజిన్ ను(motor cycle engine) బిగించాడు. దీనికి మోటార్ సైకిళ్ళకు అవసరమైనట్టు పెట్రోల్ అవసరం అవుతుంది. ఇంధనం మండటం ద్వారా వెలువడే పొగ బయటకు వెళ్ళిపోవడానికి బైక్ లకు ఉన్నట్టు ఎగ్జాస్ట్ పైప్(exhaust pipe) కూడా ఉంది. ఈ సైకిల్ ను మోటార్ బైక్ లాగా స్టార్ట్ చేసి తొక్కకుండా నడపచ్చు. వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ స్టార్ చేసి దాన్ని తొక్కకుండా ఎంచక్కా సైకిల్ పెడల్స్ మీద కాళ్లు పెట్టుకుని వెళ్ళడం చూడచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: నిజమైన హీరో నువ్వేనయ్యా.. ఆవు పీక పట్టుకుని చంపుతున్న సింహాన్ని ఒంటిచేత్తో ఉరికించాడు..


ఈ వీడియోను deden.jangkung.3 అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'ఇది నిజమైన మోటార్.. సైకిల్' అని ఒకరు కామెంట్ చేశారు. 'దీనికి మోటార్ సైకిల్ ఇంజిన్ ఉంది కాబట్టి హెల్మెట్ కూడా పెట్టుకోవాల్సిందే' అని అన్నారు. ఒకరు ఈ సైకిల్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాన్ని కామెంట్స్ లో షేర్ చేసుకున్నారు. 'దీన్ని తిరుపతి బండి అనేవారు, దీని ధర 2వేల రూపాయలు ఉండేది. మానాన్నగారు 1975సంవత్సరంలోనే ఇలాంటిది కొన్నారు. పక్క గ్రామంలో డ్రిల్ మాస్టర్ పెట్రోల్ కోసం మా షాపు దగ్గరకు వచ్చినప్పుడు నేను చూశాను. అప్పుడు నాది చాలా చిన్నవయసు' అని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఈ ఆవిష్కరణ పాతదే అయినా మరుగున పడి, మళ్ళీ కొత్తగా ప్రజలలోకి వస్తున్నట్టు అర్థమవుతుంది.

Hair Fall: జుట్టు ఎందుకు రాలుతుంది? అందరూ చెప్పే కారణాలలో నిజాలెంత? అబద్దాలెంత?


Updated Date - 2023-07-03T10:44:19+05:30 IST