Share News

Viral Video: మార్కెట్ లోకి కొత్తరకం జీన్స్.. నెటిజన్ల శాపాలు మామూలుగా లేవుగా..

ABN , First Publish Date - 2023-10-30T13:26:07+05:30 IST

ఈ ప్యాంటును చూసిన తరువాత నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. ఈ ఫ్యాషన్ నాశనం అయిపోవాలి అంటూ గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నారు.

Viral Video: మార్కెట్ లోకి కొత్తరకం జీన్స్.. నెటిజన్ల శాపాలు మామూలుగా లేవుగా..

ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది. నేటికాలంలో ప్రతిరోజూ వందలాది కొత్తరకం వస్త్రాలు మార్కెట్లో రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా మహిళల దుస్తులకు ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. మోడల్స్ సైతం తమ ప్రతిభకు పదును పెడుతూ అద్బుతాలు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన వస్త్రాలలో రిప్డ్ జీన్స్ ముందువరుసలో ఉంటున్నాయి. ఈ రిప్డ్ జీన్స్ వర్గంలో తాజాగా మార్కెట్లోకి విడుదలైన ఓ ప్యాంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ ఫ్యాషన్ నాశనం అయిపోవాలి అంటూ గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి గురైన ఈ ఫ్యాషన్ గురించి పూర్తీ వివరంగా తెలుసుకుంటే.

ఇతరులకంటే విభిన్నంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం వస్త్రాధారణ నుండి ఆభరణాల వరకు చాలా వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఫ్యాషన్ తో బిజినెస్ చేసేవారికి ఇలాంటి వారే బలహీనత. అందుకే వింత వింత దుస్తులను(STRANGE CLOTHS)ప్రవేశపెడుతుంటాయి. సాధారణంగా కన్నాలు, చిరుగులు ఉన్న ప్యాంటులను రిప్డ్ జీన్స్ అంటున్నారు. ఇప్పుడు రిప్డ్ జీన్స్(ripped jeans) వర్గంలో ఓ జీన్స్ ప్యాంట్ మార్కెట్లోకి వచ్చింది. వీడియోలో ఓ వ్యక్తి తన చేతిలో హ్యాంగర్ పట్టుకుని ఉండటం చూడచ్చు. దాన్ని చూడగానే ఇంతకీ కొత్త ఫ్యాషన్ జీన్స్ ప్యాంట్ ఏది అనే డౌట్ వస్తుంది. కానీ సరిగ్గా గమనిస్తే అతని చేతిలో ఉన్న హ్యాంగర్ కు ఉన్న ప్యాంటు ముక్క కనిపిస్తుంది. జానెడు పొడవు కూడా లేని ఈ జీన్స్ ప్యాంటుకు కేవలం నడుము పట్టీ, దాని కింద అరకొర పాకెట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది కేవలం నడుముకు బిగించుకునే ప్యాంటు తప్ప తొడలను, పాదాలను కవర్ చేసుకోవడానికి కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే ఈ చిన్న ముక్క ప్యాంటు ధర రూ.1,699/(1,699/-rs). ఈ ప్యాంటు ముక్కను చూసిన నెటిజన్లు మాత్రం చాలా షాకవుతున్నారు.

Viral Video: ఓరి దేవుడో.. దీన్ని ఎలా తింటున్నార్రా నాయనా..? ఇడ్లీలతో ఇలాంటి ప్రయోగాలేంటి..?



ఈ వీడియోను 777zone_2 అనే ఇన్స్టాగ్రామ్(Instagram)అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియోలో ఉన్న జీన్స్ ను చూసిన తరువాత నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. దీనిమీద గుర్రుగా కామెంట్స్ చేస్తున్నారు. 'అసలు ఆ జీన్స్ ను ఎవరు వేసుకుంటారు?' అని ఒకరు కోపంగా కామెంట్ చేశారు. 'ఇది 2030 పెద్ద ఫ్యాషన్ వేర్' అని ఇంకొకరు వ్యంగ్యంగా స్పందించారు. 'దీన్ని ఫ్యాషన్ అంటారా? ఇది నాశనమైపోవాలి' అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Viral Video: ఈ చిన్నారికి ఏమైంది? అమ్మవారిని చూస్తూ ఎందుకిలా ఏడుస్తోంది? దేవీనవరాత్రులలో విస్తుపోయే సంఘటన..


Updated Date - 2023-10-30T13:26:07+05:30 IST