Ajinkya Rahane: రహానే సిక్స్ కొడితే.. స్టేడియం పైకప్పుపై పడిన బంతి.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-04-18T10:34:52+05:30 IST

కొద్ది నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే ఈ ఐపీఎల్‌లో దుమ్ము రేపుతున్నాడు

Ajinkya Rahane: రహానే సిక్స్ కొడితే.. స్టేడియం పైకప్పుపై పడిన బంతి.. వీడియో వైరల్!

కొద్ది నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే (Ajinkya Rahane) ఈ ఐపీఎల్‌లో (IPL 2023) దుమ్ము రేపుతున్నాడు. టీ-20 క్రికెట్‌కు సరిపడినంత వేగంగా ఆడలేడనే ముద్ర వేయించుకున్న రహానే తన శైలికి భిన్నంగా చెలరేగుతున్నాడు. ముంబైపై (MIvsCSK) 27 బంతుల్లోనే 61 పరుగులు కొట్టి ఫామ్‌లోకి వచ్చిన రహానే తాజాగా మరోసారి సత్తా చాటాడు. తాజాగా బెంగళూరుతో (RCBvsCSK) జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు.

చెన్నై ఇన్సింగ్స్‌లో తొలి రెండు సిక్స్‌లు కొట్టింది రహానేనె. రహానే కొట్టిన తొలి సిక్సర్ ఏకంగా చిన్నస్వామి స్టేడియం పైకప్పుపై పడింది (Rahane Smashes A Six On The Roof). ఆ సిక్స్ చూసి బెంగళూరు కెప్టెన్ డుప్లెసి ఆశ్చర్యపోయాడు. విజయ్ కుమార్ వైశాక్ వేసిన ఓవర్లో రహానే రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. ఓపెనర్ రుతురాజ్ అవుట్ కావడంతో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండో వికెట్‌కు కాన్వేతో (Devon Conway) కలిసి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

Rinku Singh: రింకూ సింగ్‌ది ఎంత పెద్ద మనసు.. పేద క్రికెటర్ల కోసం హాస్టల్ కట్టిస్తున్న కోల్‌కతా బ్యాటర్!

బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లో కూడా రహానే సత్తా చాట్టాడు. బెంగళూరు బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి మరీ ఆపాడు. సిక్స్ ఖాయం అనుకున్నది కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై టీమ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది.

Updated Date - 2023-04-18T10:34:52+05:30 IST