వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు అమన్‌

ABN , First Publish Date - 2023-08-28T01:25:25+05:30 IST

అమన్‌ సెహ్రావత్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. శనివారం జరిగిన జాతీయ ట్రయల్స్‌ 57కేజీ విభాగంలో తను విజేతగా నిలిచాడు...

వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు అమన్‌

పటియాల: అమన్‌ సెహ్రావత్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. శనివారం జరిగిన జాతీయ ట్రయల్స్‌ 57కేజీ విభాగంలో తను విజేతగా నిలిచాడు. అలాగే ఆకాశ్‌ దహియా (61కేజీ), అనూజ్‌ కుమార్‌ (65కేజీ), అభిమన్యు (70కేజీ), సచిన్‌ (79కేజీ) కూడా అర్హత సాధించారు. సెప్టెంబరు 16 నుంచి బుడాపె్‌స్టలో జరిగే ఈ పోటీల్లో భారత రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే ఆసియా గేమ్స్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాతో పాటు దీపక్‌ పూనియా కూడా ఈ ట్రయల్స్‌కు హాజరుకాలేదు.

Updated Date - 2023-08-28T01:25:25+05:30 IST