IND vs WI: సంజూ శాంసన్ రీఎంట్రీ.. వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా టెస్ట్, వన్డే జట్లు ఎంపిక
ABN, First Publish Date - 2023-06-23T17:14:27+05:30
జూలై 12 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా (Team India) వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు టెస్ట్, వన్డే జట్లను (Test and ODI squad) ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ప్రస్తుతానికి సెలక్టర్లు టెస్ట్, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను ప్రకటించారు. టీ20 సిరీస్‌కు ఇంకా ప్రకటించలేదు. అయితే ముందుగా వచ్చిన వార్తల ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మకు( Rohit Sharma) సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వలేదు. అదే సమయంలో హిట్‌మ్యాన్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారని వచ్చిన వార్తలు కూడా నిజం కాలేదు.
ముంబై: జూలై 12 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా (Team India) వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు టెస్ట్, వన్డే జట్లను (Test and ODI squad) ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ప్రస్తుతానికి సెలక్టర్లు టెస్ట్, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను ప్రకటించారు. టీ20 సిరీస్‌కు ఇంకా ప్రకటించలేదు. అయితే ముందుగా వచ్చిన వార్తల ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మకు( Rohit Sharma) సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వలేదు. అదే సమయంలో హిట్‌మ్యాన్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారని వచ్చిన వార్తలు కూడా నిజం కాలేదు. సెలెక్టర్లు మరోసారి రోహిత్‌కే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. కానీ కొంతకాలంగా తీవ్రంగా నిరాశపరుస్తున్న టెస్ట్ ప్లేయర్ చటేశ్వర్ పుజారాపై (Cheteshwar pujara) వేటు పడగా.. అంతా ఊహించనట్టుగానే రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), యశస్వి జైస్వాల్‌కు(Yashasvi Jaiswal) టెస్ట్ టీంలో చోటు దక్కింది. గైక్వాడ్ వన్డే జట్టులో సైతం చోటు దక్కించుకున్నాడు.
డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌తోపాటు కొంతకాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్‌పై కూడా సెలెక్టుర్లు వేటు వేశారు. అతని స్థానంలో యువ పేసర్ ముఖేష్ కుమార్‌కు టెస్ట్, వన్డే రెండు జట్లలో చోటు కల్పించారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడంతో నవదీప్ సైనీకి టెస్ట్ జట్టులో చోటు దక్కింది. ఇక తెలుగు ఆటగాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ టెస్ట్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ అంటూ ఇటీవల వార్తలు వచ్చిన అజింక్యా రహానేను (Ajinkya Rahane) సెలెక్టర్లు వైస్ కెప్టెన్‌గా నియమించారు. మొత్తం 16 మందితో కూడిన టెస్ట్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు.
ఇక వన్డే జట్టు విషయాన్నికొస్తే ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson) మళ్లీ టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్ తమ స్థానాలను నిలుపుకోగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వన్డేల్లో వైస్ కెప్టెన్ కొనసాగనున్నాడు. మొత్తం 17 మందితో కూడిన వన్డే జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. కాగా గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇక భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 12 నుంచి 25 మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. 27 నుంచి ఆగస్టు 1 మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.
టెస్ట్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
Updated Date - 2023-06-23T17:24:35+05:30 IST