ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AUS: ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏం అన్నాడంటే..?

ABN, First Publish Date - 2023-11-20T08:19:07+05:30

Rohit sharma Comments: ముచ్చటగా మూడో సారి కప్ గెలవాలనే ఆశ నెరవేరలేదు. మన ఆటగాళ్ల వైఫల్యానికి తోడు అది ఏదో పగబట్టినట్టుగా పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోయాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన కెప్టెన్ ఓటమిని ఒప్పుకున్నాడు.

అహ్మదాబాదాద్: కల చెదిరింది. కోట్లాది మంది అభిమానుల గుండె పగిలింది. కళ్లలో నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్నీ ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఏదైతో జరగకూడదని ఆశించామో అదే జరిగింది. ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. ముచ్చటగా మూడో సారి కప్ గెలవాలనే ఆశ నెరవేరలేదు. మన ఆటగాళ్ల వైఫల్యానికి తోడు అది ఏదో పగబట్టినట్టుగా పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోయాయి. మన జట్టు బ్యాటింగ్ చేస్తుంటే బంతి ఏ మాత్రం బ్యాట్ మీదకి రాలేదు. స్లోగా మారిన పిచ్‌పై పరుగులు చేయడం కష్టమైపోయింది. అదే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంటే మాత్రం మంచు ప్రభావంతో బంతి నేరుగా బ్యాట్ మీదకి వెళ్లింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన కెప్టెన్ ఓటమిని ఒప్పుకున్నాడు. తాము సరిగ్గా ఆడలేకపోయామని, బ్యాటింగ్‌లో మరో 20, 30 పరుగులు చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. ట్రావిస్ హెడ్, లబుషేన్‌ల భాగస్వామ్యమే తమకు మ్యాచ్‌ను దూరం చేసిందని అన్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా గెలుపు క్రెడిట్ వారికే ఇచ్చాడు. నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనూకూలించిందని, కానీ తాము దానిని సాకుగా చెప్పాలనుకోవడం లేదని రోహిత్ శర్మ అన్నాడు.


‘‘ఫలితం మాకు అనుగుణంగా రాలేదు. ఈ రోజు మేము బాగా ఆడలేకపోయాం. మ్యాచ్ గెలవాడినికి మేము అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ బ్యాటింగ్‌లో మేము ఇంకో 20-30 పరుగులు చేస్తే బాగుండేది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ సమయంలో మేము 270 -280 పరుగులు చేస్తామని భావించాం. కానీ ఆ తర్వాత మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. దీంతో అనుకున్నన్నీ పరుగులు సాధించలేకపోయాం. 240 పరుగులు మాత్రమే చేసినప్పుడు లక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ వికెట్లు తీయాల్సింది. కానీ అలా జరగలేదు. హెడ్, లబుషేన్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మాకు మ్యాచ్‌ను దూరం చేశారు. క్రెడిట్ వారిద్దరికే దక్కుతుంది. వారిని ఔట్ చేయడానికి మేము చేయగల్గిన ప్రయత్నాలన్నీ చేశాం. రెండో ఇన్నింగ్స్‌లో ప్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడానికి వికెట్ మెరుగ్గా ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. అయితే దీనిని సాకుగా చూపించాలని అనుకోవడం లేదు. ఇక్కడ ప్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం ఏ జట్టుకైనా అనుకూలిస్తుందని మాకు ముందే తెలుసు. మేము ముందుగా తగినన్నీ పరుగులు చేయలేదు. మా పేసర్లు ఆరంభంలోనే 3 వికెట్లు తీశారు. మేము ఆటను బాగానే ప్రారంభించాం. కానీ ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయాం. మధ్యలో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వారిద్దరికే క్రెడిట్ దక్కుతుంది.’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

Updated Date - 2023-11-20T08:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising