IND vs PAK: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 8 మైల్‌స్టోన్స్ చేరుకున్న రోహిత్ శర్మ.. దిగ్గజాల రికార్డులు బ్రేక్
ABN, First Publish Date - 2023-10-15T09:41:56+05:30
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ పోరులో ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ పోరులో ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ(86) విధ్వంసంతో లక్ష్యాన్ని టీమిండియా 30.3 ఓవర్లలోనే చేధించింది. మరోసారి టీ20 మాదిరిగా విధ్వంసం సృష్టించిన రోహిత్ 6 ఫోర్లు, 6 సిక్సులతో 63 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ 8 మైల్‌స్టోన్స్ రికార్డులను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, షాహీద్ ఆఫ్రిదీ, ఏబీ డివిల్లియర్స్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలుకొట్టాడు. ఇక ఈ విజయంతో వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై ఉన్న ఓటమెరుగని రికార్డును టీమిండియా 8-0తో మరింత మెరుగుపరచుకుంది.
303- ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 6 సిక్సులు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో రోహిత్ 300 సిక్సులను పూర్తి చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా, అలాగే తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ కంటే ముందు ఈ రికార్డును మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, షాహీద్ ఆఫ్రిదీ సాధించారు. అయితే వారిద్దరి కంటే వేగంగా ఈ రికార్డును అందుకున్న ఘనత మాత్రం రోహిత్‌కే దక్కింది. రోహిత్ 246 ఇన్నింగ్స్‌ల్లో ఈ క్లబ్‌లో చేరాడు.
40- ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీ ఓపెనర్‌గా రోహిత్‌కు 40వది. దీంతో వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్(39) రికార్డును అధిగమించాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్(75), సౌరవ్ గంగూలీ(58) ఉన్నారు.
1- వన్డే ప్రపంచకప్ చరిత్రలో లక్ష్య చేధనలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు.
86- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత కెప్టెన్ హిట్‌మ్యాన్ ఘనత సాధించాడు.
14- ఐసీసీ వైట్‌బాల్ ఈవెంట్స్‌ల్లో లక్ష్య చేధనలో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన బ్యాటర్‌గా కోహ్లీతో కలిసి రోహిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు 14 సార్లు ఈ మార్క్ అందుకున్నారు.
69- వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. డివిల్లియర్స్ 67 సిక్సులు కొట్టగా.. రోహిత్ 69 సిక్సులు కొట్టాడు. 113 సిక్సులు కొట్టిన విండీస్ మాజీ క్రికెటర్ గేల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.
2- వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు (1195) సాధించిన రెండో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (2278) టాప్‌లో ఉన్నాడు.
2- వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు 50+ రన్స్ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్(11) నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (21) మొదటి స్థానంలో ఉన్నాడు.
Updated Date - 2023-10-15T09:43:28+05:30 IST