ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AFG: ఒకే మ్యాచ్‌లో 15 రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులు ఏంటంటే..?

ABN, First Publish Date - 2023-10-12T11:07:57+05:30

కెప్టెన్ రోహిత్ శర్మ(131) విధ్వంసకర సెంచరీతో అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు పాయింట్ల టేబుల్‌లో ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది.

ఢిల్లీ: కెప్టెన్ రోహిత్ శర్మ(131) విధ్వంసకర సెంచరీతో అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు పాయింట్ల టేబుల్‌లో ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది(80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్(62) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ 84 బంతుల్లోనే 16 ఫోర్లు, 5 సిక్సులతో 131 పరుగులు చేశాడు. లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ(55*) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఏకంగా 15 రికార్డులను అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్, సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య వంటి దిగ్గజ ఆటగాళ్ల ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.


7- వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును హిట్‌మ్యాన్‌ రోహిత్‌ బద్దలుకొట్టాడు. రోహిత్‌ మూడు మెగా టోర్నీల్లో 2015, 2019, 2023లో ఏడు సెంచరీలు నమోదు చేశాడు. అయితే సచిన్‌ ఆరు శతకాలు (1992, 1996, 1999, 2003, 2007, 2011) కొట్టాడు.

1000- మెగా ఈవెంట్‌లో వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్‌గా వార్నర్‌ (19 ఇన్నింగ్స్‌) రికార్డును రోహిత్‌ సమం చేశాడు. సచిన్‌ (20), సౌరవ్‌ గంగూలీ (21) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

556- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 556 సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ (553)ను అధిగమించాడు.

31- వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన మూడో బ్యాటర్‌గా రోహిత్‌ (31 శతకాలు) నిలిచాడు. 30 శతకాలు నమోదు చేసిన ఆసీస్‌ గ్రేట్‌ రికీ పాంటింగ్‌ను శర్మ అధిగమించాడు. సచిన్‌ (49), విరాట్‌ కోహ్లీ (47) ముందున్నారు.

63- ప్రపంచక్‌పలో వేగవంతమైన శతకం నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రోహిత్‌ (63 బంతుల్లో) నిలిచాడు. కపిల్‌దేవ్‌ (72 బంతులు) రికార్డును హిట్‌మ్యాన్‌ బ్రేక్‌ చేశాడు. ఓవరాల్‌గా ఆరో బ్యాటర్‌గా నిలిచాడు.

28- వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 28 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(27) రికార్డును బద్దలు కొట్టి భారత్ తరఫున అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

29- ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చేసిన సెంచరీ వన్డేల్లో ఓపెనర్‌గా అతనికి 29వది. దీంతో వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ ఆటగాడు(28) సనత్ జయసూర్యను అధిగమించాడు. ఈ జాబితాలో 45 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు.

131- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో 175 రన్స్‌తో కపిల్ దేవ్ ముందంజలో ఉన్నాడు.

1- స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

4- ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో మొదటి వికెట్‌కు 150+పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం రోహిత్‌కు ఇది నాలుగో సారి. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు.

76- ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ పవర్ ప్లేలోనే 76 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో పవర్ ప్లేలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో 77 పరుగులు చేసిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకెల్లమ్ మొదటి స్థానంలో ఉన్నాడు.

3-వన్డే ప్రపంచకప్ చరిత్రలో విజయవంతమైన లక్ష్య చేధనలో సెంచరీ సాధించడం రోహిత్ శర్మకు ఇది 3వ సారి. దీంతో విజయవంతమైన లక్ష్య చేధనలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.

4- ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 50 సిక్సులను పూర్తి చేసుకున్నాడు. ఇలా ఒక సంవత్సరంలో 50 సిక్సులు కొట్టడం రోహిత్ శర్మకు ఇది నాలుగో సారి. గతంలో 2017, 2018, 2019లలో కూడా రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇలా అత్యధిక సంవత్సరాలు 50 సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

1- వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఓపెనర్‌గా, పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

Updated Date - 2023-10-12T11:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising