World Cup: సిక్సర్లలో చరిత్ర సృష్టించిన టీమిండియా.. 5 దశాబ్దాల వన్డే క్రికెట్ చరిత్రలో..
ABN, First Publish Date - 2023-11-13T12:34:47+05:30
ICC Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏ ఒక్కరూ కూడా విఫలం కాకుండా అందరూ 50+స్కోర్లు సాధించారు. టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలోనే టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏ ఒక్కరూ కూడా విఫలం కాకుండా అందరూ 50+స్కోర్లు సాధించారు. టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలోనే టాప్ 5 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించడం ఇదే మొదటి సారి కావడం విశేషం. బ్యాటర్ల విధ్వంసంతో వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే టీమిండియా రెండో అత్యధిక స్కోర్ 410/4 నమోదు చేసింది. ఈ క్రమంలో మన బ్యాటర్లు సిక్సర్లతో రెచ్చిపోయారు. అందరూ కలిసి ఏకంగా 16 సిక్సులు బాదేశారు. శ్రేయస్ అయ్యర్ 5, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ నాలుగేసి, రోహిత్ శర్మ 2, విరాట్ కోహ్లీ ఒక సిక్సు బాదారు. వన్డేల్లో భారత్ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో బాదిన రెండో అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమనార్హం. ఈ క్రమంలో 5 దశాబ్దాల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు బాదిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో భారత జట్టు ఇప్పటివరకు ఏకంగా 215 సిక్సులు బాదింది. ఈ క్రమంలో 2019లో 209 సిక్సులు కొట్టిన వెస్టిండీస్ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా మరిన్ని మైల్‌స్టోన్స్‌ను కూడా అందుకుంది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది వరుసగా 9వ విజయం. దీంతో సింగిల్ ప్రపంచకప్ ఎడిషన్‌లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. వరుసగా 11 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ సంవత్సరం వన్డేల్లో టీమిండియాకు ఇది 24వ విజయం. దీంతో 1998వ సంవత్సరంలో సాధించిన 24 వన్డే మ్యాచ్‌ల విజయాలను టీమిండియా సమం చేసింది. దీంతో మరొక మ్యాచ్ గెలిస్తే ఒక వన్డే క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా అత్యధిక మ్యాచ్‌లు గెలిచినట్టువుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 9 మంది బౌలర్లను ఉపయోగించింది. దీంతో ఒక వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 9 మంది బౌలర్లను ఉపయోగించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా 16 వికెట్లు తీశాడు. దీంతో ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు.
Updated Date - 2023-11-13T12:44:59+05:30 IST