World cup: ఏ జట్టుకు ఆడిన మనసంతా తెలుగు వాళ్లపైనే.. సెంచరీని పుష్ప స్టైలులో సెలబ్రేట్ చేసుకున్న వార్నర్ బాబాయి
ABN, First Publish Date - 2023-10-21T11:31:15+05:30
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌పై సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడ్డాయి.
బెంగళూరు: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌పై సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తెలుగు వాళ్లు ముద్దుగా బాబాయి అని పిలుచుకునే డేవిడ్ వార్నర్ విశ్వరూపం చూపించాడు. పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోసిన వార్నర్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. సాధారణంగానే పాకిస్థాన్ అంటే రెచ్చిపోయి ఆడే వార్నర్ ఈ సారి కూడా అదే చేశాడు. 14 ఫోర్లు, 9 సిక్సులతో 124 బంతుల్లో 163 పరుగులు బాదేశాడు. పాకిస్థాన్‌పై వన్డేల్లో వార్నర్‌కు ఇది వరసగా నాలుగో సెంచరీ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీ అనంతరం వార్నర్ చేసుకున్న సంబరాలు నెట్టింట్ వైరల్‌గా మారాయి. దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ స్టైలులో వార్నర్ సంబరాలు చేసుకున్నాడు. సెంచరీ చేసిన వెంటనే తగ్గెదేలే అంటూ వార్నర్ సైగలు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇది చూసిన అభిమానులు వార్నర్ ఏ జట్టుకు ఆడిన అతని మనసంతా తెలుగు వాళ్లపైనే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తగ్గెదేలే అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో డేవిడ్ వార్నర్ మళ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాలని కోరుతున్నారు. కాగా మైదానంలో వార్నర్ పుష్ప స్టైలులో సంబరాలు చేసుకోవడం ఇది కొత్తేం కాదు. గతంలోనూ పలుమార్లు ఇలానే చేశాడు. కాగా వార్నర్‌కు తెలుగు సినిమాలపై ప్రత్యేక అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన సమయంలో ఈ అభిమానం ఏర్పడింది. అప్పటి నుంచి వార్నర్ అనేక తెలుగు సినిమాలకు సంబంధించిన రీల్స్ చేశాడు. వార్నర్‌తోపాటు అతని కుటుంబం కూడా రీల్స్ చేసింది. దీంతో అటు క్రికెట్ పరంగా, ఇటు సినిమాల పరంగా తెలుగు వాళ్లకు వార్నర్ బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో అతడిని అందరూ బాబాయి అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో వార్నర్ బాబాయిగా తెలుగు వాళ్ల హృదయాల్లో వార్నర్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163), మిచెల్ మార్ష్ (108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) ఆకాశమే హద్దుగా భారీ శతకాలతో విజృంభించారు. అనంతరం స్పిన్నర్ ఆడమ్ జంపా (4/53) కీలక వికెట్లతో దెబ్బతీశాడు. దీంతో పాక్‌పై 62 పరుగుల తేడాతో నెగ్గిన ఆసీస్.. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు చేసింది. షహీన్ అఫ్రీదికి ఐదు, రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో పాక్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ఇమామ్ (70), అబ్దుల్లా షఫీక్ (64), రిజ్వాన్ (46) మాత్రమే ఆకట్టుకున్నారు. స్టొయినిస్, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా వార్నర్ నిలిచాడు.
Updated Date - 2023-10-21T11:31:15+05:30 IST