ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup: పాపం కష్టాలన్నీ న్యూజిలాండ్‌కే.. మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయంటే..?

ABN, First Publish Date - 2023-11-09T12:15:34+05:30

New zealand vs Sri lanka: ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. కివీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత బలబలాల పరంగా చూసుకుంటే శ్రీలంకను ఓడించడం న్యూజిలాండ్‌కు పెదగా కష్టం కాకపోవచ్చు.

బెంగళూరు: ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. కివీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత బలబలాల పరంగా చూసుకుంటే శ్రీలంకను ఓడించడం న్యూజిలాండ్‌కు పెదగా కష్టం కాకపోవచ్చు. దీంతో లంకను ఓడించి శ్రీలంక సెమీస్ చేరుతుందని అంతా భావించారు. సెమీస్ రేసులో కివీస్‌తో పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ కూడా పోటీ పడే అవకాశాలున్నాయి. కానీ నెట్ రన్ రేటు పరంగా కివీస్‌కు మెరుగైన అవకాశాలున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడం బ్లాక్ క్యాప్స్‌ను కలవరపెడుతోంది.


బెంగళూరు వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడే అవాకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వర్షం ముప్పు ఎక్కువగా ఉంది. పూర్తి ఆటకు కాకపోయిన పలు మార్లు వర్షం ఆటంకం కల్గించే అవకాశాలున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే న్యూజిలాండ్ సెమీస్ చేరే అవకాశాలు దాదాపుగా ఉండవు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితేనే అవకాశాలుంటాయి. అలా కాకుండా కివీస్ మ్యాచ్ రద్దై పాక్, అఫ్ఘాన్‌లలో ఏదో ఒక జట్టు గెలిచినా న్యూజిలాండ్‌కు సెమీస్ అవకాశాలుండవు. నిజానికి పాకిస్థాన్‌తో ఆడిన గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓటమికి వర్షం కారణంగా చెప్పుకోవచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. వర్షం పడే అవకాశాలుండడంతో పాకిస్థాన్ జట్టు తెలివిగా లక్ష్య చేధనలో ధాటిగా ఆడింది. 25 ఓవర్లలోనే 200 పరుగులు చేసింది. సరిగ్గా ఇక్కడ వర్షం అడ్డుపడడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో పాక్‌ను విజేతగా ప్రకటించారు. ఒకవేళ పూర్తి ఆట జరిగి ఉంటే పాక్ గెలిచేది కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఒకవేళ కివీస్ ఆ మ్యాచ్ గెలిచి ఉంటే ఆ జట్టు సెమీస్ బెర్త్ కూడా దాదాపుగా ఖరారు అయ్యేది. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ రద్దై కివీస్ సెమీస్ చేరకపోతే వర్షం కారణంగానే ఆ జట్టు నాకౌట్ దశ నుంచి నిష్క్రమించినట్టవుతుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. వర్షమే కివీస్‌ను ఇంటికి పంపినట్టవుతుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో పలువురు అభిమానులు ఆ జట్టుపై సానుభూతి చూపిస్తూ పాపం కష్టాలన్నీ న్యూజిలాండ్‌కే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఈ టోర్నీ ఆరంభంలో వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి అందరి కంటే ముందుగానే సెమీస్ చేరేలా కనిపించిన న్యూజిలాండ్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో సెమీస్ అవకాశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. దీనికి తోడు కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఫెర్గ్యూసన్ వంటి కీలక ఆటగాళ్ల గాయాలు కూడా ఆ జట్టుకు మైనస్‌గా మారాయి.

స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే బెంగళూరులో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. వర్షం వచ్చే అవకాశాలు 49 శాతం ఉన్నాయి. రెండు గంటల సమయంలో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 49 శాతం వర్షం వచ్చే అవకాశాలున్నాయి. 3 గంటల సమయంలో 25 డిగ్రీల ఉష్ణోగ్రత, 57 శాతం వర్షం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల సమయంలో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 49 శాతం వర్షం పడొచ్చు. సాయంత్ర 5 గంటల సమయంలో 25 డిగ్రీల ఉష్ణోగ్రత, 49 వర్షం పడే అవకాశాలున్నాయి. 6 గంటల సమయంలో 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండగా ఏకంగా 66 శాతం వర్షం వచ్చే అవకాశాలున్నాయి. రాత్రి 7 గంటల సమయంలో 23 డిగ్రీల ఉష్ణోగ్రత, 40 శాతం వర్షం అవకాశాలు.. 8 గంటల సమయంలో 22 డిగ్రీల ఉష్ణోగ్రత, 34 శాతం వర్షం వచ్చే అవకాశాలున్నాయి. ఇక రాత్రి 9 గంటల సమయంలో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 39 శాతం వర్షం వచ్చే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల సమయంలో 21 డిగ్రీల ఉష్ణోగ్రత, 49 శాతం వర్షం.. 11 గంటల సమయంలో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 75 శాతం వర్షం వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-11-09T12:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising