World cup: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరం?
ABN, First Publish Date - 2023-10-29T09:02:13+05:30
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా ఉంది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి.
లక్నో: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా ఉంది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మేరకు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ వెల్లడించాయి. దీంతో అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ కథనాల ప్రకారం.. శనివారం నెట్స్‌లో రోహిత్ శర్మ తీవ్రంగా శ్రమించాడు. అయితే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బంతి హిట్‌మ్యాన్ కుడి చేతి మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో రోహిత్ నొప్పితో బాధపడినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఫిజియో వచ్చి రోహిత్ గాయాన్ని పరిశీలించాడు. అనంతరం రోహిత్ శర్మ మళ్లీ ప్రాక్టీస్‌కు రాలేదు. అయితే హిట్‌మ్యాన్ గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. అటు బీసీసీఐ కూడా రోహిత్ శర్మ గాయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ విషయంపై సందిగ్దత నెలకొంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడకపోతే భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి.
ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టుకు అద్భుత ఆరంభాలను ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక తన అద్భుత కెప్టెన్సీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అన్ని విధాల జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడకపోతే ఇంగ్లండ్‌ను ఎదుర్కొవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా నేడు ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు. అతను మరో రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. కెప్టెన్ రోహిత్ కూడా దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. అయితే హిట్‌మ్యాన్ ఆడతాడా? లేదా? అనే విషయంపై మ్యాచ్ ప్రారంభానికి ముందే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ గాయం తీవ్రతను పరీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే కేఎల్ రాహుల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Updated Date - 2023-10-29T09:02:13+05:30 IST