ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs PAK: ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్ సంపూర్ణ అధిపత్యానికి కారణమెంటో తెలుసా?.. పాపం పాకిస్థాన్ ఆ ఒక్క పని చేయలేక..

ABN, First Publish Date - 2023-10-14T13:14:32+05:30

ఒకటి కాదు.. రెండు కాదు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌తో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో భారతే గెలిచింది. రెండు జట్లు 7 సార్లు తలపడితే 7 సార్లు భారత్‌నే విజయం వరించింది. ప్రతిసారి పాకిస్థాన్ ఓడిపోతూనే ఉంది.

ఒకటి కాదు.. రెండు కాదు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌తో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో భారతే గెలిచింది. రెండు జట్లు 7 సార్లు తలపడితే 7 సార్లు భారత్‌నే విజయం వరించింది. ప్రతిసారి పాకిస్థాన్ ఓడిపోతూనే ఉంది. 1992 వన్డే ప్రపంచకప్‌లో ప్రారంభమైన ఈ పోటీ 3 దశాబ్దాలకుపైగా నిర్వరామంగా కొనసాగుతోంది. కానీ 3 దశాబ్దాలుగా కనీసం ఒక సారి కూడా పాకిస్థాన్ గెలవలేదు. పాకిస్థాన్ ప్రపంచకప్ గెలిచిన 1992 సంవత్సరంలో కూడా భారత్ చేతిలో ఆ జట్టు ఓడింది. అలా అని భారత్ కన్నా పాకిస్థాన్ బలహీన జట్టు అనుకుంటే పొరపాటే. బలబలాల విషయంలో భారత్ సమాన ప్రత్యర్థి పాకిస్థాన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకనొక సమయంలో భారత్ కన్నా పాకిస్థాన్ జట్టే బలంగా ఉండేది. అంతెందుకు రెండు జట్ల ఓవరాల్ వన్డే రికార్డుల్లో పాకిస్థాన్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు 134 వన్డే మ్యాచ్‌ల్లో తలపడితే పాకిస్థాన్ 73, భారత్ 56 సార్లు గెలిచాయి. అటు టెస్టు ఫార్మాట్లోనూ పాకిస్థాన్‌దే పైచేయిగా ఉంది. కానీ ఏం లాభం ప్రపంచకప్ అనే సరికి మాత్రం పాకిస్థాన్ తలవంచుతుంది. భారత ఆటగాళ్ల విధ్వంసం దెబ్బకు పాకిస్థాన్ ఆటగాళ్లు చేతులెస్తున్నారు.

అయితే ప్రపంచకప్‌లో ప్రతిసారి పాకిస్థాన్‌పై టీమిండియానే విజయం సాధించడంపై పలువురు క్రీడా విశ్లేషకులు స్పందించారు. దాదాపుగా అందరూ చెప్పిన కారణం ఏంటంటే.. ‘‘ఒత్తిడి’’. క్రీడా విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం.. సాధారణ మ్యాచ్‌లు ఎన్ని గెలిచినా ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో జట్లపై ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని పాకిస్థాన్ జట్టు అధిగమించలేకపోతుంది. కానీ భారత జట్టు మాత్రం ఒత్తిడిని అద్భుతంగా ఎదుర్కొంటుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే సాధారణంగా విపరీతమైన క్రేజుతోపాటు కచ్చితంగా గెలవాలనే ఒత్తిడి కూడా ఆటగాళ్లపై ఉంటుంది. పైగా రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు వంటి అనేక మంది ప్రముఖులు మ్యాచ్‌ను వీక్షిస్తుంటారు. పలువురు నేరుగా మైదానానికి వచ్చే మ్యాచ్‌ను వీక్షిస్తుంటారు. మైదానం మొత్తం ఇసుకేస్తే రాలని జనంతో కిక్కిరిసిపోతుంది. అలా అంతమంది ప్రేక్షకులు, గొప్ప గొప్ప వాళ్ల ముందు ఆడాలనే సరికి సాధారణంగానే ఆటగాళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. కానీ ఈ ఒత్తిడిని భారత జట్టు తట్టుకోగల్గుతుంది. తీవ్ర ఒత్తడిలోనూ అద్భుతంగా ఆడుతున్న భారత ఆటగాళ్లు విజయం సాధిస్తున్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. జట్టులో ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌‌లో ఉండే ఒత్తిడిని అధిగమించి రాణించలేకపోతున్నారు. 3 దశాబ్దాలుగా ఇదే జరుగుతుంది. దీంతో ప్రతిసారి ఆ జట్టు ఓడిపోతూనే ఉంది. సాధారణంగానే ఈ సారి కూడా రెండు జట్లపై ఒత్తిడి ఉంది. అయితే రెండు జట్లలో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ఈ సారి కూడా ఒత్తిడిని తట్టుకుని రాణించిన వారినే విజయం వరించడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ సారి విజయం ఎవరిని వరిస్తోందో..

Updated Date - 2023-10-14T13:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising