ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AUS 2nd ODI: శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. ఓవరాల్‌గా దాసోహమైన రికార్డులివే!

ABN, First Publish Date - 2023-09-24T17:49:38+05:30

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు.

ఇండోర్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు. వన్డేల్లో గిల్‌కు ఇది ఆరో సెంచరీ కాగా.. ఈ సంవత్సరం ఐదో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో గిల్‌కు అనేక రికార్డులు సైతం దాసోహమయ్యాయి. వన్డే కెరీర్‌లో వేగంగా 6 సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు. ధావన్ 46 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు కొట్టగా.. గిల్ 35 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు బాదేశాడు. అలాగే వన్డేల్లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 5 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ కూడా చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరాడు. ఈ జాబితాలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్ ఉన్నారు. అలాగే 25 ఏళ్ల వయసు లోపే ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో గిల్ కంటే ముందు సచిన్, గ్రేమ్ స్మిత్, ఉప్పుల్ తరంగ, విరాట్ కోహ్లీ ఉన్నారు.


ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా గిల్ తన వన్డే కెరీర్‌లో 1,900 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందుకు 35 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే వన్డేల్లో ఈ సంవత్సరం 1,000 పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌ రికార్డు నెలకొల్పిన గిల్ తాజాగా 1,200 పరుగులను సైతం పూర్తి చేసుకున్నాడు. అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డును సైతం యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున ఈ ఏడాది అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మను గిల్ అధిగమించాడు. ఆసీస్ పేసర్ గ్రీన్ వేసిన 10వ ఓవర్ ఐదో బంతిని సిక్సర్ బాదడం ద్వారా గిల్ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా ఈ ఏడాది రోహిత్ శర్మ ఇప్పటివరకు 43 సిక్సులు కొట్టగా.. గిల్ తాజాగా 44 సిక్సులకు చేరుకున్నాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ భారత్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక 50+ స్కోర్లు, అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా కూడా అన్ని రికార్డులను తన పేరు మీదనే లిఖించుకున్నాడు.

Updated Date - 2023-09-24T17:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising