IND vs AUS రెండో వన్డేకు వర్షం ఆటంకం.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా స్కోర్ ఎంతంటే?
ABN, First Publish Date - 2023-09-24T14:40:53+05:30
అనుకున్నట్టుగానే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. టీమిండియా స్కోర్ 9.5 ఓవర్లలో 79/1గా ఉన్న సమయంలో వర్షం వచ్చింది.
ఇండోర్: అనుకున్నట్టుగానే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. టీమిండియా స్కోర్ 9.5 ఓవర్లలో 79/1గా ఉన్న సమయంలో వర్షం వచ్చింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ప్రస్తుతం మ్యాచ్ వేదికైన ఇండోర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(32), శ్రేయస్ అయ్యర్(34) ఉన్నారు. ధాటిగా ఆడిన వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 37 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 8 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ పేసర్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అంతకుముందు టాస్ గెలిచిన పర్యాటక జట్టు ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో అతిథ్య జట్టు భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కీలక మార్పులతో బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా స్థానంలో ప్రసిద్ కృష్ణ ఆడుతున్నాడు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగుతోంది. స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్మాత్ స్మిత్(కెప్టెన్), లబుషేన్, జాస్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, కెమెరాన్ గ్రీన్, సీన్ అబ్బాట్, ఆడమ్ జంపా, జాష్ హజల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్.
ఇండియా: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్/వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్ధూల్ థాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ.
Updated Date - 2023-09-24T14:40:53+05:30 IST