ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Australia: అద్భుత క్యాచ్‌తో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

ABN, First Publish Date - 2023-10-08T15:16:48+05:30

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతిని ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతిని ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ తన ఎడమ వైపునకు డైవ్ చేసి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. 6 బంతులు ఆడిన మార్ష్ డకౌటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 5 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. కాగా విరాట్ కోహ్లీ పట్టిన ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ రికార్డు కూడా నెలకొల్పాడు. వన్డే వరల్డ్‌ కప్‌ల చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. కుంబ్లే 14 క్యాచ్‌లు పట్టగా.. 15 క్యాచ్‌లతో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(40), స్టీవ్ స్మిత్ (31) ఉన్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయంగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

తుది జట్లు

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Updated Date - 2023-10-08T15:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising