Jaiswal: జైస్వాల్‌ 11 స్థానాలు పైకి

ABN , First Publish Date - 2023-07-27T02:42:50+05:30 IST

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముందంజ వేశాడు.

Jaiswal: జైస్వాల్‌ 11 స్థానాలు పైకి

దుబాయ్‌: టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముందంజ వేశాడు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల జాబితాలో జైస్వాల్‌ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 63వ ర్యాంకుకు చేరుకున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొమ్మిదో ర్యాంకుతో భారత్‌ నుంచి టాప్‌-10లో ఉన్న ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. పంత్‌ 12, కోహ్లీ 14వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. కేన్‌ విలియమ్సన్‌ టాప్‌ ర్యాంకును నిలబెట్టుకోగా.. లబుషేన్‌, జో రూట్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్లలో ఆర్‌. అశ్విన్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకును కాపాడుకోగా, జడేజా ఆరో స్థానానికి ఎగబాకాడు. ఇక సిరాజ్‌ ఆరు స్థానాలు ముందుకెళ్లి 33వ ర్యాంకులో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా (1), అశ్విన్‌ (2), అక్షర్‌ పటేల్‌ (5) ర్యాంకుల్లో మార్పు లేదు.

Updated Date - 2023-07-27T02:42:50+05:30 IST