SRHvsLSG: మలక్‌పేట్ మర్క్రమ్ వచ్చేశాడు.. టాస్ గెలిచి ఏం ఎంచుకున్నాడో చూడండి..!

ABN , First Publish Date - 2023-04-07T19:19:27+05:30 IST

ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ ఐపీఎల్-16 సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడి చావు దెబ్బ తిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో..

SRHvsLSG: మలక్‌పేట్ మర్క్రమ్ వచ్చేశాడు.. టాస్ గెలిచి ఏం ఎంచుకున్నాడో చూడండి..!

లక్నో: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ ఐపీఎల్-16 సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడి చావు దెబ్బ తిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడనుంది. శుక్రవారం రాత్రి 7.30కు మొదలవనున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేని సన్‌రైజర్స్ కెప్టెన్ మర్క్రమ్ ఈ మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక.. లక్నో విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడి 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో 218 పరుగుల టార్గెట్‌కు ఆల్‌మోస్ట్ దగ్గరగా వెళ్లి 205 పరుగులు చేసి పోరాడి ఓడింది.

సన్‌రైజర్స్ అభిమానులైతే కెప్టెన్‌ మర్క్రమ్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ‘మలక్‌పేట్ మర్క్రమ్’ అని ముద్దుగా ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు పిలుచుకుంటున్న ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ హైదరాబాద్ జట్టు రాత మారుస్తాడో.. లేదో.. చూడాలి.

Updated Date - 2023-04-07T19:19:32+05:30 IST