Ashes 4th Test: ఇంగ్లండ్ తుది జట్టులో కీలక మార్పు.. 40 ఏళ్ల ఆటగాడికి మరో అవకాశం
ABN , First Publish Date - 2023-07-17T18:56:12+05:30 IST
యాషెస్ సిరీస్ 2023లో ( The Ashes 2023) భాగంగా ఈ నెల 19 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (England vs Australia 4th Test) మధ్య కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచినా లేక మ్యాచ్ డ్రా అయినా యాషెస్ సిరీస్ కంగారుల సొంతం అవుతుంది. దీంతో హోంగ్రౌండ్‌లో యాషెస్ సిరీస్‌ను కోల్పోయి ఇంగ్లండ్ పరువు పోగొట్టుకోవలసి వస్తుంది.
మాంచెస్టర్: యాషెస్ సిరీస్ 2023లో ( The Ashes 2023) భాగంగా ఈ నెల 19 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (England vs Australia 4th Test) మధ్య కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచినా లేక మ్యాచ్ డ్రా అయినా యాషెస్ సిరీస్ కంగారుల సొంతం అవుతుంది. దీంతో హోంగ్రౌండ్‌లో యాషెస్ సిరీస్‌ను కోల్పోయి ఇంగ్లండ్ పరువు పోగొట్టుకోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను ఇంగ్లీష్ జట్టు డూ ఆర్ డైగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. మొదటి రెండు టెస్టులు ఓడినప్పటికీ.. మూడో టెస్ట్ గెలిచి ఫామ్‌లోకి వచ్చిన ఇంగ్లీష్ జట్టు నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఆ జోరు కొనసాగించి సిరీస్‌ను కాపాడుకోవాలని భావిస్తోంది.
ఈ క్రమంలో మ్యాచ్‌కు 2 రోజుల ముందుగానే తమ ప్లేయింగ్ 11ను కూడా ప్రకటించింది. తుది జట్టులో ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. పేసర్ ఓలి రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మిగతా జట్టంతా యథావిధిగా కొనసాగనుంది. కాగా 40 ఏళ్ల జేమ్స్ అండర్సన్ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో పెదగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో చోటు దక్కలేదు. ఇక రాబిన్సన్ విషయానికొస్తే మొదటి రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్లతో రాణించినప్పటికీ మూడో టెస్ట్‌లో విఫలమయ్యాడు. పైగా మ్యాచ్ మధ్యలో గాయం కూడా కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. దీంతో మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ రాబిన్సన్ స్థానంలో అండర్సన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. కాగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ల ప్రస్తుతం కంగారులు 2-1తో అధిక్యంలో ఉన్నారు.
ఇంగ్లండ్ తుది జట్టు
బెన్ డకెట్, జాక్ క్రాలే, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెయిర్‌స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్