ఫైనల్‌కు ప్రత్యేక ప్రణాళిక వద్దు!
ABN , First Publish Date - 2023-11-18T01:30:56+05:30 IST
ప్రపంచక్‌పలో ఇప్పటిదాకా ఎలా ఆడుతూ వస్తోందో ఫైనల్లోనూ భారత్ అలాగే ఆడాలని టీమిండియా మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి సూచించాడు.
కొత్తగా ఏమీ చేయొద్దన్న రవిశాస్త్రి
చెన్నై: ప్రపంచక్‌పలో ఇప్పటిదాకా ఎలా ఆడుతూ వస్తోందో ఫైనల్లోనూ భారత్ అలాగే ఆడాలని టీమిండియా మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. టైటిల్ పోరు కదా అని ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం లేదన్నాడు. ‘ఫైనల్లోనూ మన జట్టే ఫేవరెట్. కచ్చితంగా భారత్ కప్పు గెలుస్తుంది. టోర్నమెంట్ ఆద్యంతం మన ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడినీ దరిచేరనివ్వవద్దు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రదర్శనతో చెలరేగారో ఆసీ్‌సతో పోరులోనూ అంతే దీటుగా విజృంభించాలి. ఫైనల్ కోసమని కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరంలేదు. సెమీఫైనల్లో ఆడినట్టు ఇక్కడా అంతే ఏకాగ్రతతో, పూర్తి అంకితభావంతో ఆడితే చాంపియన్లం మనమే’ అని రోహిత్ సేనకు శాస్త్రి సలహా ఇచ్చాడు.