World Cup: గంగూలీ, డివిల్లియర్స్ రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ.. మరొక సిక్సు కొడితే సరికొత్త చరిత్ర
ABN, First Publish Date - 2023-11-12T10:58:07+05:30
Rohit sharma Records: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. తన అద్బుత కెప్టెన్సీతో ఆకట్టుకుంటూనే బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పవర్‌ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. బౌలర్ ఎంత గొప్పవాడైనా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా వీర బాదుడు బాదుతున్నాడు. అంతకన్నా ముఖ్యంగా వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా పూర్తిగా జట్టు కోసం ఆడుతున్నాడు. ఎలాంటి స్వార్థం లేని ఆటను ఆడుతూ జట్టును అన్ని విధాల ముందుండి నడిపిస్తున్నాడు.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. తన అద్బుత కెప్టెన్సీతో ఆకట్టుకుంటూనే బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పవర్‌ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. బౌలర్ ఎంత గొప్పవాడైనా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా వీర బాదుడు బాదుతున్నాడు. అంతకన్నా ముఖ్యంగా వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా పూర్తిగా జట్టు కోసం ఆడుతున్నాడు. ఎలాంటి స్వార్థం లేని ఆటను ఆడుతూ జట్టును అన్ని విధాల ముందుండి నడిపిస్తున్నాడు. హిట్‌మ్యాన్ మంచి ఆరంభాలనిస్తుండడంతో టీమిండియా భారీ స్కోర్లు చేయగలగుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 55 సగటుతో 442 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగే అఖరి లీగ్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్ రికార్డులను రోహిత్ శర్మ బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ 10 రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. దీంతో దీపావళి నాడు హిట్‌మ్యాన్ ఆ 10 రికార్డులను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
1- ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 58 సిక్సులు కొట్టాడు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ కూడా 2015లో 20 వన్డేల్లో 58 సిక్సులు బాదాడు. ఇప్పటివరకు ఒక ఏడాదిలో వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు డివిల్లియర్స్ పేరు మీదనే ఉంది. దీంతో రోహిత్ శర్మ మరొక సిక్సు కొడితే ఏబీ డివిల్లియర్స్ ఆల్‌టైమ్ రికార్డును అధిగమిస్తాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
5- అలాగే మరొక 5 సిక్సులు కొడితే వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఈ క్రమంలో 49 సిక్సులు కొట్టిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును హిట్‌మ్యాన్ అధిగమిస్తాడు. కాగా ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 45 సిక్సులు కొట్టాడు.
24- ఒక వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రికార్డు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేరు మీద ఉంది. 2003 వన్డే ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా 11 మ్యాచ్‌లాడిన గంగూలీ 465 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 442 పరుగులు చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ మరొక 24 పరుగులు చేస్తే గంగూలీని అధిగమిస్తాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
2- అలాగే ఈ ప్రపంచకప్‌లో మరో 58 పరుగులు చేస్తే రోహిత్ శర్మ 500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. దీంతో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండు వన్డే ప్రపంచకప్‌లలో 500+ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలుస్తాడు. కాగా గత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక సచిన్ టెండూల్కర్ విషయానికొస్తే 1996 ప్రపంచకప్‌లో 523 పరుగులు, 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు చేశాడు.
9- ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే ఈ ప్రపంచకప్‌లో వరుసగా 9వ విజయం అవుతుంది. దీంతో ఒక ప్రపంచకప్‌లో ఎడిషన్‌లో వరుసగా 9 విజయాలు నమోదు చేసిన మొదటి బారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు.
1500- నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 80 పరుగులు చేస్తే వన్డే ప్రపంచకప్ చరిత్రలో 1500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. దీంతో వన్డే ప్రపంచకప్ టోర్నీలో వేగంగా 1500 పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. కాగా హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 25 ఇన్నింగ్స్‌ల్లో 1420 పరుగులు చేశాడు.
3- నెదర్లాండ్స్‌పై రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే వన్డే ఫార్మాట్లో మొత్తం 11 జట్లపై సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఈ ఫీట్ సాధించారు.
12- హిట్‌మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో 14 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. దీంతో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో 14 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. కాగా రోహిత్ శర్మ ఇప్పటివరకు వన్డేలు, టీ20లు, టెస్టులు, ఐపీఎల్‌లో కలిపి 13,988 పరుగులు చేశాడు.
4- మరో 4 ఫోర్లు కొడితే కెప్టెన్‌గా రోహిత్ శర్మ వన్డేల్లో 100 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు.
108- మరో 108 పరుగులు చేస్తే కెప్టెన్‌గా రోహిత్ శర్మ వన్డేల్లో 2 వేల పరుగులను చేరుకుంటాడు.
Updated Date - 2023-11-12T11:01:38+05:30 IST