Viral Video: లంక ప్రీమియర్ లీగ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన పాము.. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో చక్కర్లు
ABN, First Publish Date - 2023-08-12T22:14:08+05:30
లంక ప్రీమియర్ లీగ్‌లో(Lanka Premier League 2023) మరోసారి పాము(snake) కలకలం సృష్టించింది. ప్రేమదాస్ స్టేడియంలో జాఫ్నా కింగ్స్, లవ్ కాండీ(Jaffna Kings and B-Love Kandy) మధ్య ఈ సీజన్ 15వ మ్యాచ్ జరుగుతుండగా ఓ పాము మైదానంలోని బౌండరీ లైన్ వద్ద ఓ పాము కనిపించింది.
కొలంబో: లంక ప్రీమియర్ లీగ్‌లో(Lanka Premier League 2023) మరోసారి పాము(snake) కలకలం సృష్టించింది. ప్రేమదాస్ స్టేడియంలో జాఫ్నా కింగ్స్, లవ్ కాండీ(Jaffna Kings and B-Love Kandy) మధ్య ఈ సీజన్ 15వ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోని బౌండరీ లైన్ వద్ద ఓ పాము కనిపించింది. అయితే మైదానం నుంచి బయటికి ఎలా వెళ్లాలో తెలియక కాసేపు అక్కడే పాము చక్కర్లు కొట్టింది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ కొనసాగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. సదరు పాము మ్యాచ్‌ను టెలికాస్ట్ చేస్తున్న కెమెరాల కంటపడింది. పాము బౌండరీ లైన్ వద్ద వేగంగా వెళ్లుతుండడం కెమెరాల్లో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సోషల్ మీడియాలో వీడియోను చూసిన నెటిజన్లలో పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గ్రౌండ్ సిబ్బంది పామును బయటికి తరమడంతో ఆ తర్వాత మ్యాచ్ సజావుగా సాగింది. లంక ప్రీమియర్ లీగ్‌కు ముఖ్య అతిథిగా పాము హాజరైందని పలువురు రాసుకొస్తున్నారు.
కాగా లంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో పాము కనిపించడం ఈ సీజన్‌లో ఇది రెండో సారి. గాలె టైటాన్స్, దంబుల్లా ఓర్రా మధ్య జరిగిన ఈ సీజన్ రెండో మ్యాచ్‌లో మైదానంలో ఓ పాము దర్శనమిచ్చింది. రెండో ఇన్నింగ్స్ 4వ ఓవర్ సమయంలో పాము కనిపించడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. అయితే గ్రౌండ్ సిబ్బంది వచ్చి పామును బయటికి తరమడంతో ఆ తర్వాత మ్యాచ్ సజావుగా జరిగింది.
Updated Date - 2023-08-12T22:14:24+05:30 IST