ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం.. మరి రోహిత్ పరిస్థితేంటంటే..?

ABN, First Publish Date - 2023-11-29T12:24:51+05:30

త్వరలో ప్రారంభం కాబోయే సౌతాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కోహ్లీ ఇప్పటికే బీసీసీఐ, సెలెక్టర్లకు సమాచారం ఇచ్చినట్టు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి.

త్వరలో ప్రారంభం కాబోయే సౌతాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కోహ్లీ ఇప్పటికే బీసీసీఐ, సెలెక్టర్లకు సమాచారం ఇచ్చినట్టు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి. ప్రస్తుతం హాలీడే ట్రిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి పొట్టి ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. దీంతో భవిష్యత్‌లో కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతాడా? లేదా? అనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండడం అందరికి ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. అయితే టెస్ట్ సిరీస్ మాత్రం అందుబాటులో ఉంటానని కోహ్లీ చెప్పాడట. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సఫారీ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం హాలీడే ట్రిప్‌లో భాగంగా లండన్‌లో ఉన్నాడు.


అలాగే హిట్‌మ్యాన్ కూడా 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత మళ్లీ పొట్టి క్రికెట్ ఆడలేదు. అయితే సఫారీ పర్యటనలో హిట్‌మ్యాన్ టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడని సమాచారం. కాబట్టి వన్డే సిరీస్ నాటికి జట్టులో చేరొచ్చు. లేదంటే అతను కూడా వన్డే సిరీస్‌కు దూరమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా? లేదా? అనే అంశంపై చర్చ జరుగుతున్న వేళ వీరిద్దరు సౌతాఫ్రికా పర్యటనలో వైట్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండడం గమనార్హం. ఇక అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సౌతాఫ్రికా పర్యటనలో ఆడబోయే భారత జట్టును త్వరలోనే ఎంపిక చేయనుంది. కాగా కొంతకాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లకు ప్రపంచకప్ అనంతరం బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కాగా సౌతాఫ్రికా పర్యటన డిసెంబర్ 10 నుంచి ప్రారంభంకానుంది. 10 నుంచి 14 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, 17 నుంచి 21 మధ్య మూడు వన్డేల సిరీస్, 26 నుంచి జనవరి 7 మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.

Updated Date - 2023-11-29T12:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising