Vivo: రెండు వేరియంట్లలో వివో 5జీ కొత్త స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయ్..
ABN , First Publish Date - 2023-04-11T16:10:32+05:30 IST
చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ అండ్ కమ్యూనికేషన్ సంస్థ వివో (Vivo) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ అండ్ కమ్యూనికేషన్ సంస్థ వివో (Vivo) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగవారం, ఏప్రిల్ 11న భారత మార్కెట్లో రెండు వేరియంట్లలో కొత్తగా వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫిఫ్ల్ కార్ట్ ద్వారా వివో టీ2 5జీ, వివో టీ2 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని సంస్థ పేర్కొంది. వచ్చే వారం నుంచి ఫోన్లను విక్రయించనున్నారు.
కొత్త వివో టీ సిరీస్ (Vivo T2 series) ఫోన్లు ఆండ్రాయిడ్ వోఎస్ 13 ద్వారా పని చేయనున్నాయి. మల్టీపుల్ కలర్స్ ఆప్షన్ తోపాటు డ్యూయల్ రియర్ కెమెరాలు ఉంటాయి. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వివో టీ2 5జీ ఫోన్ రూ.18,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వివో టీ2 5జీ ఫోన్ రూ. 20,999, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ వివో ఫోన్ టీ2 ఎక్స్ 5జీ రూ. 12,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ వివో టీ2 ఎక్స్ 5జీ ఫోన్ రూ. 13,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ వివో టీ2 ఎక్స్ 5జీ ఫోన్ రూ. 15,999 ఉంటుంది.
వివో టీ2 5జీ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
డ్యూడల్ సిమ్ (నానో-సిమ్) వివో టీ2 5జీ ఆండ్రాయిండ్ వోఎస్ 13తో పని చేయనుంది. 6.38- అంగుళాల డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 695 ఎస్ వోసీ, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 128జీబీ అంతర్గత నిల్వ, మైక్రో ఎస్డీ కార్డు అప్ టూ 1 టెరా బైట్, వై-ఫై6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, వోటీజీ, యూఎస్బీ టైపు-సీ పోర్టు, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది.