సిర్పూర్‌(టి)లో ఎకో బ్రిడ్జి, జింకల పార్కు స్థల పరిశీలన చేసిన మంత్రి ఐకే రెడ్డి

ABN , First Publish Date - 2023-02-27T22:32:49+05:30 IST

సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 27: మండలంలోని భీమన్న గుడి సమీపంలో ఎకో బ్రిడ్జి, జింకల పార్కు ఏర్పాటు స్థలాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధికారులతో కలిసి మ్యాప్‌ ద్వారా పరిశీలించారు.

సిర్పూర్‌(టి)లో ఎకో బ్రిడ్జి, జింకల పార్కు స్థల పరిశీలన చేసిన మంత్రి ఐకే రెడ్డి

సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 27: మండలంలోని భీమన్న గుడి సమీపంలో ఎకో బ్రిడ్జి, జింకల పార్కు ఏర్పాటు స్థలాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధికారులతో కలిసి మ్యాప్‌ ద్వారా పరిశీలించారు. అనంతరం మండలకేంద్రం లోని నాగమ్మ చెరువులోని బుద్ధవిగ్రహాన్ని పరశీలించి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బాండ్‌ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.

మంత్రికి ఘనస్వాగతం..

కాగజ్‌నగర్‌: సిర్పూరు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాగజ్‌నగర్‌కు వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి సోమవారం ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప ఘనస్వాగతం పలికారు. అనం తరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కోనప్ప నిత్యాన్నదాన సత్రంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనప్ప చేస్తున్న సేవలు చాలా బాగున్నాయన్నారు. ప్రజల కోసం అనునిత్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

Updated Date - 2023-02-27T22:32:50+05:30 IST