ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah: కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారు

ABN, First Publish Date - 2023-11-27T16:37:14+05:30

కాంగ్రెస్‌ ( Congress ) పార్టీతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుమ్మక్కయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: కాంగ్రెస్‌ ( Congress ) పార్టీతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుమ్మక్కయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మంచిర్యాలలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టేనని అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కోనేశాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే.. మళ్లీ కేసీఆర్ కోనేస్తాడని అన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే రాహుల్ బాబాను ప్రధానిని చేస్తాడని అమిత్ షా ఎద్దేవ చేశారు.

కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ ప్రభుత్వం రాదని చెప్పారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భయపడే కేసీఆర్ హైదరాబాద్ విమోచనదినోత్సవం జరపడం లేదన్నారు.కేసీఆర్, కాంగ్రెస్‌లు ఓవైసీకి భయపడుతున్నారని దెప్పిపోడిశారు. ముస్లింలకు ఇచ్చిన 4శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామన్నారు. మాదిగల సంక్షేమం కోసం ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుందన్నారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మాఫీ చేస్తామని అమిత్ షా ప్రకటించారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-27T18:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising