Ponguleti: కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది.. కేసీఆర్ దోచుకున్న ప్రజాధనం కక్కిస్తాం
ABN , First Publish Date - 2023-11-25T22:11:35+05:30 IST
కూసుమంచి మండలం జీళ్ళచెరువు ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం జీళ్ళచెరువు ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
"ఖమ్మంలో 10కి 10ది వస్తాయి అంటేనే తట్టుకోలేక పోతున్నావ్ కేసీఆర్. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. దోచుకున్న ప్రజాధనం కక్కిస్తాం. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నువ్వు దోచుకుని తింటున్నావ్. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలె కానీ కేసీఆర్ కుటుంబానికి 6 ఉద్యోగులు వచ్చాయి. కొంతమంది నాయకులు అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకొండి. నీకు దమ్ముంటే రా మీ ఊరు వచ్చా. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇస్టమొచ్చినట్లు మాట్లాడితే కబడ్ధార్. నా కాంగ్రెస్ నాయకులకు గానీ, శ్రీనివాస్ రెడ్డిని ఏమైనా అంటే తాట తీస్తా. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల ఫలితాలు చాలా అవసరం. తెలంగాణ సాధించుకుని పది సంవత్సరాలైన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది." అని పొంగులేటి విమర్శించారు.
"కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చెప్పిన మాటలు అయిన తరువాత చేసే పనులకు సంబంధం ఉండదు. మాయమాటలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట. మిమ్మల్ని భూమి మీద కాదు, చంద్రమండలం మీద నడిపిస్తా అని చెబుతాడు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షలు, రెండు వందల యూనిట్ ల కరెంట్ ఉచితంగా ఇస్తుంది. నాణ్యమైన సన్న బియ్యం ఇస్తాం. BRS ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు. నన్ను, రేవంత్ రెడ్డిని ఓడించాలని కోట్లు ఖర్చు చేస్తున్నారు. కన్నీటి డ్రామాలు నమ్మకండి. మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ గుర్తుకు వేయండి." అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.