Vijayashanthi : కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాములమ్మకు కీలక బాధ్యతలు
ABN , First Publish Date - 2023-11-18T10:49:07+05:30 IST
బీజేపీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో విజయశాంతి ఆ పార్టీని వీడి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నిన్న అలా చేరారో లేదో.. ఇవాళ ఆవిడకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి అప్పగించింది. ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్‌ను నియమించింది.
హైదరాబాద్ : బీజేపీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో విజయశాంతి ఆ పార్టీని వీడి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నిన్న అలా చేరారో లేదో.. ఇవాళ ఆవిడకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి అప్పగించింది. ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్‌ను నియమించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే ఆమెకు కీలక పదవి దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. బడంగ్‌పేట్ మేయర్ పారిజాత మహేశ్వరం టికెట్ ఆశించారు. అది దక్కకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. దీంతో ఆమెకు ప్రచార, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా నియమించి కూల్ చేసింది.