KTR : కిషన్‌రెడ్డి ఓడిపోతాననే భయంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు
ABN, First Publish Date - 2023-11-27T23:48:37+05:30
అంబర్‌పేట ప్రజలు తమ రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా అంబర్‌పేటకు త్వరలో మెట్రో రైలు తీసుకు వస్తామని రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) హామీ ఇచ్చారు.
హైదరాబాద్: అంబర్‌పేట ప్రజలు తమ రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా అంబర్‌పేటకు త్వరలో మెట్రో రైలు తీసుకు వస్తామని రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) హామీ ఇచ్చారు. సోమవారం నాడు అంబర్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ తరఫున ఈ నియోజకవర్గంలోని అలీ కేఫ్ చౌరస్తాలో సోమవారం రాత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...‘‘ అంబర్‌పేట ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాలేరు వెంకటేష్‌ను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. ముస్లిం ప్రజల కోరిక మేరకు వారికి శ్మశాన వాటికకు స్థలం కేటాయించామని చెప్పారు.
అదేవిధంగా హిందువులు, క్రైస్తవులకు కూడా శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. నగరంలో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా త్వరలో ప్రతిరోజు తాగు నీరు అందించే కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారు. కాలేరు వెంకటేష్ ప్రజల మనిషిని అంబర్‌పేట అభివృద్ధి కోసం ఆయన నిరంతరం పనిచేస్తారన్నారు. ఈ ఎన్నికల్లో కాలేరు వెంకటేష్‌ని గెలిపించాలని కోరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోతానని భయంతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, బి పద్మ, దూసరి లావణ్య, బీఆర్ఎస్ పార్టీ అంబర్‌పేట ఎన్నికల కోఆర్డినేటర్ కే పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-28T00:13:16+05:30 IST