Harish Rao: కర్ణాటకలో కాంగ్రెస్‌ను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది
ABN , First Publish Date - 2023-11-24T22:23:54+05:30 IST
కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయిందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) సెటైర్లు వేశారు.
హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయిందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే వచ్చి తెలంగాణ రాష్ట్రం మేం పెట్టిన భిక్ష అన్నాడు. మరి దేశానికి స్వాతంత్ర్యం కూడా బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్షనా? సొంత రాష్ట్రంలో నీళ్లు, రోడ్లు లేని ఖర్గే ఇక్కడికి వచ్చి నీతులు చెబుతున్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన తర్వాత రాహుల్ గాంధీ జాడ లేడు ప్రియాంకా గాంధీ పత్తా లేదు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతు బంధు, కరెంట్ పోతది.హస్తానికి ఓటేసి కర్ణాటక వాళ్లలాగా ఆగం అయిదామా? రిస్క్ వద్దనుకుంటే కారుకే ఓటు గుద్దాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మారుస్తాం.కేసీఆర్ చెప్పింది చేశాడు. చెప్పనిది కూడా చేశాడు’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.