ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi : కేసీఆర్ దోచుకున్న డబ్బులను ప్రజల ఖాతాల్లో వేస్తాం

ABN, First Publish Date - 2023-11-26T15:18:37+05:30

సీఎం కేసీఆర్ ( CM KCR ) దోచుకున్న డబ్బులను ప్రజల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు రాహుల్ గాంధీ జోగిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంగారెడ్డి జిల్లా: సీఎం కేసీఆర్ ( CM KCR ) దోచుకున్న డబ్బులను ప్రజల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు రాహుల్ గాంధీ జోగిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బహిరంగ సభలో మాట్లాడుతూ...‘‘ దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్ మధ్య పోటీ జరుగుతుంది. ప్రపంచంలో ప్రసిద్ది గాంచిన హైదరాబాద్‌ని కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. కేసీఆర్ కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశారో అంత కక్కిస్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూమిలో కుంగి పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీ చేశారు. ఇసుక, మద్యంతో పాటు వ్యాపారాలు కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నాయి. మీ చేతిలో ధరణి ఉంది. పేదల నుంచి 20 లక్షల ఎకరాల భూమిని లాక్కున్నారు.ఆరుగాలం కష్టపడి విద్యార్థులు పరీక్షలు రాస్తే పేపర్ లీక్ అవుతోంది. దళిత బంధు స్కీమ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొకరి దగ్గర మూడు లక్షలు దోచుకున్నారు. మాది దళిత ఆదివాసి, పీడిత పాలిట సర్కార్. మీది దొరల సర్కార్ అయ్యింది. ప్రజల సర్కార్ అంటే ఎలా ఉంటాదో నేను చెబుతా’’ అని రాహుల్‌గాంధీ తెలిపారు.

బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలను కాంగ్రెస్ తొక్కి పడేసింది

‘‘ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ వస్తుందో మొట్టమొదటగా ఆరు అంశాల మీద మా మొదటి నిర్ణయం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్యాస్‌తో పాటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్, ఎవరికైతే ఇళ్లు లేవో వారికి 5 లక్షల రూపాయలు, ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రతి మండలంలో ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలను కాంగ్రెస్ తొక్కి పడేసింది. బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటయ్యాయి నాపై కేంద్రప్రభుత్వం 24 కేస్‌లు పెట్టింది. బీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులను మోదీ సర్కార్ చేయట్లేదు. మోదీ పూర్తి మద్దతు కేసీఆర్‌కు ఉంది. లోక్‌సభలో మోదీకి కేసీఆర్ మద్దతు. ఇక్కడ కేసీఆర్ మోదీకి మద్దతు ఉంటుంది’’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T16:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising