ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy : నేను జైలుకెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణం: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2023-11-09T13:24:00+05:30

కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడేది లేదన్నారు. పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ అధికారులు పెద్దఎత్తున దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారన్నారు.

హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను జైలుకెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణమనిమండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడేది లేదన్నారు. పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ అధికారులు పెద్దఎత్తున దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడబోరని తెలిపారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ అంతా అండగా ఉంటుందన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకులను ఐటీ టార్గెట్‌గా చేసుకొని దాడులు చేస్తోందన్నారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐటీ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-09T15:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising