Revanth Reddy: కేసీఆర్.. బక్కోడు అయితే బుక్కెడు తినాలి కానీ లక్ష కోట్లు దోచాడు
ABN, First Publish Date - 2023-11-26T15:10:21+05:30
సీఎం కేసీఆర్ ( CM KCR ) .. బక్కోడు అయితే బుక్కెడు తినాలి కానీ లక్ష కోట్లు,10వేల ఎకరాలు దోచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ఎద్దేవ చేశారు.
నారాయణపేట జిల్లా: సీఎం కేసీఆర్ ( CM KCR ) .. బక్కోడు అయితే బుక్కెడు బువ్వ తినాలి కానీ లక్ష కోట్లు,10వేల ఎకరాలు దోచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ఎద్దేవ చేశారు. ఆదివారం నాడు నారాయణపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ మాట్లాడుతూ...‘‘నారాయణపేట గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా. 60 ఏళ్ల కళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్ రుణం తీర్చుకుంది. రాష్ట్రం వస్తే అభివృద్ధి జరుగుతుందని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కానీ అది తీరలేదు. ఒకప్పుడు రాజేందర్‌రెడ్డిని నన్ను లవకుశలు అనే వారు. కానీ ఇప్పుడు ఆయన నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచాడు. అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించి ఉంటే ఎందుకు రైల్వేలైన్ మంజూరు కాలేదు. కొడంగల్ - నారాయణపేట పథకం పూర్తి కాలేదు. ఇక్కడ సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతా అన్న నువ్వు, మీ సీఎం ఎందుకు నీరు ఇవ్వలేదు. మీహయాంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం ఎందుకు ఏర్పాటు కాలేదు. రాష్ట్రంలో తొలి మున్సిపాలిటీ ఉంటే ఎందుకు అభివృద్ధి జరగలేదు. ఈ ఎమ్మెల్యే చవట దద్దమ్మ కాబట్టి ఈ ప్రాంతం వెనుకబడింది. చిట్టెం కుటుంబం రక్తంలోనే సేవ చేసే లక్ష్యం ఉంది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
నారాయణపేటను అభివృద్ధి చేసే బాధ్యత నాది
‘‘నారాయణపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని నర్సిరెడ్డి కళ. జీవో 69 ద్వారా 8.5 టీఎంసీల నీటితో ఈ ప్రాజెక్ట్ కట్టి ప్రతి ఎకరాకు నీరు అందించి అన్ని చెరువులు నింపాలని ఆ జీవో తీసుకువచ్చాం. కానీ ఆ పథకాన్ని కేసీఆర్ ఆటకెక్కించారు. రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు. కొడంగల్‌ని ఎలా అయితే అభివృద్ధి చేస్తానని చెప్పానో అలా నారాయణపేటను అభివృద్ధి చేసే బాధ్యత నాది. కొత్త మండలాలు ఏర్పాటు నా దృష్టికి వచ్చాంది.. ఆ మండలాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
కేసీఆర్‌కి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం కట్టిస్తాం
‘‘ ఈనియోజకవర్గ ఎమ్మెల్యేను రాయచూరుకు పంపుదాం.. ఆయన బాస్‌ను ఫార్మ్ హౌస్‌కు పంపుదాం. ఇద్దరి కోరిక వారం రోజులల్లో నెరవేరుతాయి. కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు. కేసీఆర్ అంటున్నాడు నేను బక్కోన్ని నన్ను కొట్టడానికి కాంగ్రెస్ వారు గుంపులుగా వస్తున్నారని కానీ ఆయన లక్ష కోట్లు దోచేశారు. కేసీఆర్‌ని ఖచ్చితంగా విడిచిపెట్టం. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్‌కి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం కట్టిస్తాం. ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్ ప్రకటించింది వాటిని అమలు పరుస్తాం. ప్రతి మహిళకు ఒకటో తేదీన 2500 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాం, 500కు సిలిండర్ అందిస్తాం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. షాదీముబారక్, కల్యాణ లక్ష్మీలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-26T16:06:30+05:30 IST