ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: తెలంగాణ రాకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చం ఎత్తుకునేది

ABN, First Publish Date - 2023-11-26T20:19:15+05:30

తెలంగాణ రాకుంటే కేసీఆర్ ( KCR ) కుటుంబం నాంపల్లి దర్గా, బిర్లా మందిరం దగ్గర బిచ్చం ఎత్తుకునే వారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) సెటైర్లు వేశారు.

సంగారెడ్డి: తెలంగాణ రాకుంటే కేసీఆర్ ( KCR ) కుటుంబం నాంపల్లి దర్గా, బిర్లా మందిరం దగ్గర బిచ్చం ఎత్తుకునే వారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) సెటైర్లు వేశారు. ఆదివారం నాడు పటాన్‌చెరు పారిశ్రామిక వాడ ఇస్నాపూర్ క్రాస్ రోడ్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘బీఆర్ఎస్ నేతల దగ్గర నాయకులు డబ్బు ఉండవచ్చు కాని ప్రజలు మా వైపు ఉన్నారు. ధర్మం వైపు ప్రజలు ఉన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అక్రమ సంపాదనతో వేలకోట్లు సంపాదించారు. ఆయన మీ భూములు లాక్కొని, ఆ డబ్బులతో మిమ్మల్నీ కొంటా అంటున్నాడు. మీ ఊరు చింతమడకలో నువ్వు చదివిన బడి, గుడి, నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చింతమడక నుంచి హైదరాబాద్‌ ద్వారా ప్రపంచ దేశాలకు వెళ్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధితోనే ఇది సాధ్యమైంది. బక్కొనికి ఏం కావాలి. ఫామ్ హౌజ్‌లో పంటాడు. మీ భూములు గుంజుకుంటాడు’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు

‘‘మహిపాల్ రెడ్డికి శిశు పాలుడు అని పేరు పెట్టాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు. తెలంగాణను ఏం అభివృద్ధి చేయని కేసీఆర్‌ని మూడోసారి కూడా ముఖ్యమంత్రిని చేయాలో లేదో ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్‌కు తప్పకుండా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తా. తెలంగాణను దోచుకున్న వారిలో నీ కొడుకు, కూతురు ఉన్నారు. వారందరికీ చర్లపల్లి జైల్ సరైంది. ఓటుకు పదివేల చొప్పున కేసీఆర్ పంపిండు. అది తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌ని ఈ ఎన్నికల్లో అత్యధిక మేజార్టీతో గెలిపించాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T20:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising