ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thummala : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తాం

ABN, First Publish Date - 2023-11-26T17:30:38+05:30

కాంగ్రెస్ ( Congress ) అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లా: కాంగ్రెస్ ( Congress ) అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు సత్తుపల్లి నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... ‘‘ఇది పూజ్యులు ఎన్టీఆర్ నడయాడిన నేల. ఎన్టీఆర్ వారసులుగా ఆయన ఆశీర్వాద బలంతో నలభై ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నాను. ఆ మహానుభావుడి ఆశీర్వాదంతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అత్యున్నత స్థాయి నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. ఎన్టీఆర్ స్వయంగా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాబోయే రోజులల్లో మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి మీ రుణం తీర్పుకుంటాను. ఇందిరా గాంధీ కుటుంబం తూటాలకు బలైపోతే ఇద్దరి పిల్లలను చంకనవేసుకొని సోనియమ్మ కాంగ్రెస్ పార్టీని బతికించింది. సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి సత్తుపల్లి నియోజకవర్గంలో ఎంత అభిమానం ఉందో ఇక్కడ ప్రజలు తెలుసుకోవాలి.

రాగమయిని భారీ మెజార్టీతో గెలిపించాలి

‘‘సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి రాగమయిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాక తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైన నియోజకవర్గం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గన్ని అందరూ చూసి వెళ్తున్నారంటే అంటే అది ఇక్కడ జరిగిన అభివృద్దికి నిదర్శనం. జాతీయ రహదారులతో ఈ నియోజకవర్గానికి అన్నివిధాలా సౌకర్యం కలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మనదే. సత్తుపల్లిలో రాగమయి భారీ మెజార్టీతో గెలుస్తుంది’’ అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T17:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising