Revanth Reddy: కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైంది.. మా సవాల్‌ను కేటీఆర్ స్వీకరిస్తారా? హరీష్ స్వీకరిస్తారా?
ABN, First Publish Date - 2023-07-13T19:50:14+05:30
బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధమని మండిపడ్డారు.
"నేను, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ వస్తాం. ఏ సబ్ స్టేషన్ దగ్గరుకు రమ్మంటారు?. మా సవాల్‌ను కేటీఆర్ స్వీకరిస్తారా? హరీష్ స్వీకరిస్తారా?. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైంది. ధర్మపురి అర్వివింద్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. ధర్మపురి అరవింద్‌ను కూడా సీరియస్‌గా తీసుకుంటారా?. 24 గంటల ఉచిత కరెంట్ మా పేటెంట్. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒకటో తారీఖున జీతం ఇస్తాం. ప్రభుత్వం మూడు పంటలు ఇవ్వలేదు. మూడు గింజలు కొనలేదు. నీచుడు అనే పదానికి నిలువుటద్దం కేసీఆర్. విద్యుత్ అంశంపై 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారో లేదో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఎందుకు మాట్లాడడం లేదు?. సన్నాసి పాల్పడుతున్న దోపిడీ ఆపితే మేం అనుకున్న అన్ని పాలసీలు అమలు చేయొచ్చు. రైతు డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తాం." అని రేవంత్ రెడ్డి అన్నారు.
Updated Date - 2023-07-13T19:50:24+05:30 IST