TS News : పుడితే గొప్పింట్లో పుట్టాలి.. ఇలా బతకాలనిపించడం లేదంటూ ఓ బాలుడు స్నేహితులకు వీడియో పంపి..
ABN , First Publish Date - 2023-07-14T10:54:18+05:30 IST
కోనరావుపేట మండలం కమ్మరి పేట తండాలో విషాదం చోటు చేసుకుంది. అమ్మ కొట్టిందని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కారణమేంటో తెలియదు కానీ దినేష్ అనే బాలుడిని అతని తల్లి జ్యోతి కొట్టిందట.
రాజన్న సిరిసిల్ల : కోనరావుపేట మండలం కమ్మరి పేట తండాలో విషాదం చోటు చేసుకుంది. అమ్మ కొట్టిందని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కారణమేంటో తెలియదు కానీ దినేష్ అనే బాలుడిని అతని తల్లి జ్యోతి కొట్టిందట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దినేషన్.. తన స్నేహితులకు ఒక వీడియో మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడట. ‘పుడితే గొప్ప ఇంట్లో పుట్టాలి.. ఇలా బ్రతకడం ఇష్టం అనిపించడం లేదు’ అని దినేష్ తన స్నేహితులకు వీడియో సందేశం పంపాడట. ఆపై దగ్గరిలోని అటవీ ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కుమారుడి మరణంతో భూక్యా రాజు, జ్యోతి దంపతుల కన్నీ్ళ్లు తుడవడం ఎవరి తరమూ కావడం లేదు.